Sonia Gandhi : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక
మొదట ఆమె పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ తర్వాత నేతలు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, కె సుధాకరన్ ప్రతిపాదించగా.. ఎంపీలు సమర్థించి తీర్మానం చేశారు
- Author : Sudheer
Date : 08-06-2024 - 8:53 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) మరోసారి ఎన్నికయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఎంపీలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, శశి థరూర్, అజయ్ మాకెన్, కార్తీ చిదంబరం, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా పార్టీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొదట ఆమె పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ తర్వాత నేతలు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, కె సుధాకరన్ ప్రతిపాదించగా.. ఎంపీలు సమర్థించి తీర్మానం చేశారు. తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. 99 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఇండియా కూటమి కూడా మెరుగైన సీట్లు సాధించింది. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీని ఎంపికయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్‌ను స్పీకర్ ప్రతిపక్ష నేతగా ప్రకటించనున్నారు.
రేపు మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌కు కానీ.. ఇండియా కూటమి నేతలకు గానీ ఇప్పటి వరకు ఆహ్వానాలు పంపలేదని జైరాం రమేష్ ఆరోపించారు. మోడీ ప్రమాణస్వీకారానికి విదేశీయులను ఆహ్వానించారు కానీ.. విపక్షాలను మాత్రం ఆహ్వానించలేదని తెలిపారు.
Read Also : NTR-Ramoji Rao : ఎన్టీఆర్ సైతం తన పొలిటికల్ ఎంట్రీపై రామోజీరావు సలహా తీసుకున్నారట..!