Police Station Massage : నా కోరిక తీరిస్తే నీ కొడుకును జైల్ నుండి విడిపిస్తా..కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన పోలీస్ అధికారి
బీహార్ అంటేనే రౌడీయిజం అనే పేరుంది. ఆ పేరును రూపుమాపాల్సిన పోలీస్ అధికారులే రౌడీల్లా ప్రవర్తిస్తున్న ఘటనలు బీహార్‌లో జరుగుతున్నాయి.
- By Hashtag U Published Date - 12:00 PM, Fri - 29 April 22

బీహార్ అంటేనే రౌడీయిజం అనే పేరుంది. ఆ పేరును రూపుమాపాల్సిన పోలీస్ అధికారులే రౌడీల్లా ప్రవర్తిస్తున్న ఘటనలు బీహార్‌లో జరుగుతున్నాయి. జనానికి రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ అధికారి అదే పోలీస్ స్టేషన్‌లో మహిళతో మసాజ్ చేయించుకుంటూ కెమెరాకు చిక్కిన ఘటన బీహార్‌లోని సహస్ర జిల్లాలో జరిగింది.నౌహట్టా పోలీస్‌స్టేషన్ ఏరియాలో శశిభూషణ్ సిన్హా అనే పోలీస్ అధికారికి ఈ మధ్యనే పోస్టింగ్ వచ్చింది. ఓ కేసులో అరెస్టయిన తన కొడుకును విడుదల చేయించేందుకు వచ్చిన ఓ మహిళపై శశిభూషణ్ కన్నేశాడు. తన కోరిక తీరిస్తే విడుదల చేస్తానని భయపెట్టాడు. దీంతో చేసేది లేక ఆ మహిళ సదరు పోలీస్ అధికారికి మసాజ్ చేయడానికి ఒప్పుకుంది.
మహిళ మసాజ్ చేస్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ తతంగాన్నంతా తన కెమెరాలో బంధించాడు. మసాజ్ చేస్తుండగానే ఓ లాయర్‌కు ఫోస్ చేసిన పోలీస్ అధికారి.. ఆ కుర్రాడికి బెయిల్ అప్లికేషన్ తయారుచేసి తీసుకుని రండి అంటూ చెబుతున్న మాటలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://twitter.com/UtkarshSingh_/status/1519685833271300096