12000 Jobs : ఇంజినీరింగ్ చేశారా ? ఎస్‌బీఐలో 12వేల జాబ్స్
12000 Jobs : మీరు ఇంజినీరింగ్ చేశారా ? ఉద్యోగం కోసం వెతుకుతున్నారా ?
- Author : Pasha
Date : 14-05-2024 - 9:51 IST
Published By : Hashtagu Telugu Desk
12000 Jobs : మీరు ఇంజినీరింగ్ చేశారా ? ఉద్యోగం కోసం వెతుకుతున్నారా ? అయితే ఎస్‌బీఐ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో 12వేల పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. వీటిలో 85 శాతం వరకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లనే రిక్రూట్ చేసుకోనున్నారు. 3000 మంది పీఓలు, 8000 మంది అసోసియేట్లను భర్తీ చేసుకొని బ్యాంకింగ్ వ్యవహారాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం వారిని వివిధ వ్యాపార విభాగాల్లో(12000 Jobs) నియమించుకుంటారు.
We’re now on WhatsApp. Click to Join
అధునాతన సాంకేతికత ఆధారంగా కస్టమర్లకు సేవలు అందించడంపై ప్రస్తుతం ఎస్‌బీఐ ఫోకస్ పెట్టింది. అందుకే ఇప్పుడు ఇంజినీరింగ్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి, వారి ప్రతిభను బట్టి వివిధ వ్యాపార, ఐటీ బాధ్యతలు అప్పగించనుంది. దీని వల్ల బ్యాంకింగ్ సెక్టార్‌లో తగినంత స్థాయిలో టెక్ మ్యాన్‌పవర్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు. ఏదైనా బ్యాంక్‌లో సాంకేతిక లోపాలను గుర్తిస్తే, ఆర్‌బీఐ వెంటనే పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తోంది. వీటి బారిన పడకుండా ఉండాలంటే టెక్ నిపుణుల అవసరం బ్యాంకింగ్ రంగానికి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఎస్‌బీఐ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల భర్తీ దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు.
Also Read :AP Elections : ఏపీలో భారీ పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్ ?
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో..
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికచేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి ఢిల్లీ, ముంబయి, చెన్నైలలో పోస్టింగ్ ఇస్తారు. 22-30 సంవత్సరాల మధ్య వయసున్న వారు అప్లై చేయొచ్చు. వివిధ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.