SBI: కస్టమర్స్ కు షాకిచ్చిన ఎస్‌బిఐ.. మూడు నెలల్లోనే మూడోసారి?
ప్రస్తుత రోజుల్లో సామాన్యులు లేదా లోన్ కావాలి అనుకున్న వారు లోన్ కోసం మొబైల్ ఫోన్ లో రకరకాల ఫేక్ యాప్ లను ఇన్స్టాల్ చేసి దాని ద్వారా లోన్ ను పొందడానికి ప్రయత్నిస్తున్నారు.
- By Anshu Published Date - 08:15 AM, Tue - 16 August 22

ప్రస్తుత రోజుల్లో సామాన్యులు లేదా లోన్ కావాలి అనుకున్న వారు లోన్ కోసం మొబైల్ ఫోన్ లో రకరకాల ఫేక్ యాప్ లను ఇన్స్టాల్ చేసి దాని ద్వారా లోన్ ను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అటువంటి వారిని ఆసరాగా తీసుకున్న ఫేక్ లోన్ కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దోచుకుంటున్నారు. అంతేకాకుండా అమాయకులను చేసి వాడి దగ్గర ఉన్న వస్తువులను కాజేస్తున్నారు. కాగా ఇప్పటికే ఇలా ఫేక్ ఉపయోగించి అటువంటి వారి చేతిలో మోసపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్న వారు ఎందరో ఉన్నారు.
అయితే ఇలా ఫేక్ యాప్స్ ద్వారా మోసపోయాము అంటూ తరచుగా సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ అలా ఫేక్ యాప్స్ ని నమ్ముతున్న వారిలో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇప్పటికే ఎస్బిఐ అటువంటి ఫేక్ యాప్స్ ని ఉపయోగించవద్దు అని హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఖాతాదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తోంది ఎస్బీఐ. ఇది ఇలా ఉంటే తాజాగా ఎస్బిఐ ఖాతాలో దారులకు షాక్ ఇచ్చింది. అదేమిటంటే..
రుణాలపై వసూలు చేసే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేట్ ను తాజాగా 20BPS పాయింట్లు పెంచింది. మూడు నెలల SBI MCLR రేటు 7.15% నుంచి 7.35 శాతానికి పెరగగా ఆరు నెలల వ్యవధి రుణాల వడ్డీ రేటు 7.45% నుంచి 6.65 శాతానికి పెరిగింది. ఏడాది లోన్ లపై 7.90 శాతం,2-3 ఏళ్ళ వ్యవది లోన్ లపై 8% గా ఉంచింది. కాగా 3 నెలల్లో SBI రేటు పెంచడం ఇది మూడోసారి. అంతేకాకుండా ఇది రేపటి నుంచి అమలు కాబోతోంది.