Fodder Scam : లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష
దాణా కుంభకోణంలో మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ల శిక్ష ఖరారు అయింది. జరిమానా కింద 60లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
- By CS Rao Published Date - 03:17 PM, Mon - 21 February 22

దాణా కుంభకోణంలో మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ల శిక్ష ఖరారు అయింది. జరిమానా కింద 60లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ కాలం పాటు విచారణ చేసిన సీబీఐ వేసిన చార్జిషీట్ పై వాదప్రతివాదనలు ముగిసిన తరువాత సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టు గత వారం ఈ కేసులో దోషులకు శిక్ష పరిమాణాన్ని ప్రకటించింది. ఈ పరిణామంపై లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయవాద బృందం ప్రతినిధి స్పందిస్తూ, “మేము హైకోర్టులో అప్పీలుకు వెళతాం, మా లెక్కల ప్రకారం సగం శిక్ష పూర్తయిందని చెప్పుకొచ్చింది.కేసు దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ జార్ఖండ్‌లోని డోరాండా ట్రెజరీ నుంచి రూ.139.35 కోట్లను అక్రమంగా విత్‌డ్రా చేయడంపై కేసు నమోదైంది.లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువులకు మేత, ఇతర అవసరాల కోసం వివిధ ప్రభుత్వ ఖాతాల నుంచి 950 కోట్ల రూపాయలు అక్రమ విత్‌డ్రా చేశాడు. ఆ మేరకు పశుగ్రాసం కుంభకోణం సూచిస్తుంది. డోరండా ట్రెజరీ కేసులో 99 మంది నిందితులలో 24 మంది దోషులుకాగా, ముగ్గురు నిర్దోషులుగా విడుదలయ్యారు. గత వారంలోనే 46 మంది నిందితులకు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్, 73, జార్ఖండ్‌లోని దుమ్కా, డియోఘర్ మరియు చైబాసా ట్రెజరీలకు సంబంధించిన నాలుగు ఇతర కేసుల్లో ఉన్నాడు. వాటికి సంబంధించి 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. ఆ కేసుల్లో మంగళవారం వరకు బెయిల్‌పై ఉన్న ఆయన దోషిగా నిర్థారణ కావడంతో తిరిగి జైలుకు వెళ్లాడు. అనంతరం ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నిందితుడిగా ఉన్న ఆరవ కేసు బీహార్‌లోని బంకా ట్రెజరీ వ్యవహారం కేసు ఇంకా విచారణలో ఉంది.