Jobs Without Exam : ఎగ్జామ్ లేకుండానే 1104 రైల్వే జాబ్స్
రైల్వే జాబ్ సాధించాలని పట్టుదలతో ఎంతోమంది యువత సీరియస్‌గా ప్రిపేర్ అవుతుంటారు.
- By Pasha Published Date - 01:16 PM, Sun - 16 June 24

Jobs Without Exam : రైల్వే జాబ్ సాధించాలని పట్టుదలతో ఎంతోమంది యువత సీరియస్‌గా ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. 1104 అప్రెంటిస్ పోస్టులను గోరఖ్‌పుర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ భర్తీ చేయనుంది. ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే వారు నార్త్ ఈస్ట్రన్ రైల్వే(ఎన్ఈఆర్) పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, పెయింటర్, మెషినిస్ట్ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
భర్తీ చేయనున్న పోస్టులలో.. మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్) – 411, క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్) – 155, మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్) – 151 ఉన్నాయి. క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి) విభాగంలో 75, క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్) విభాగంలో 64, సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్) విభాగంలో 63, డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్) విభాగంలో 60, బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్) విభాగంలో 35, డీజిల్ షెడ్ (గోండా) విభాగంలో 23 పోస్టులు ఉన్నాయి.
Also Read :Free Bus Travel Scheme : జులై 1 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ?
ఈ జాబ్స్‌కు అప్లై చేసే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి సహా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 12 నాటికి 15 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు ఫీజు లేదు. యాక్ట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. పదో తరగతి, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా(Jobs Without Exam) అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష ఉండదు. https://ner.indianrailways.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించేందుకు చివరితేదీ జులై 11.