Vande Bharat- 25 New Features : వందే భారత్ రైళ్లలో రాబోయే కొత్త ఫీచర్స్ ఇవే..
Vande Bharat- 25 New Features : వందే భారత్ రైళ్లు.. అడ్వాన్స్డ్ టెక్నాలజీకి మారుపేరు.. వీటిలో మరో 25 కొత్త ఫీచర్లు యాడ్ కాబోతున్నాయి..
- Author : Pasha
Date : 09-07-2023 - 8:32 IST
Published By : Hashtagu Telugu Desk
Vande Bharat- 25 New Features : వందే భారత్ రైళ్లు.. అడ్వాన్స్డ్ టెక్నాలజీకి మారుపేరు..
వీటిలో మరో 25 కొత్త ఫీచర్లు యాడ్ కాబోతున్నాయి..
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఈ కొత్త ఫీచర్లతో వందే భారత్ రైళ్ల ఉత్పత్తి జరుగుతోంది.
ఇంతకీ అవేంటి ?
దేశీయంగా అభివృద్ధి చేసిన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు లుక్ లోనూ.. ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించే విషయంలోనూ మంచిపేరు తెచ్చుకున్నాయి. ప్రత్యేకించి వాటిలోని సేఫ్టీ మెకానిజంపై నిపుణులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే వందే భారత్ రైళ్లలో అగ్నిమాపక వ్యవస్థ, రైలు లోపలి, వెలుపలి భాగాలను పర్యవేక్షించడానికి CCTV కెమెరాలు కూడా ఉన్నాయి. అయితే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఉత్పత్తి అవుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల కొత్త వెర్షన్‌లు 25 కొత్త ఫీచర్స్ ను(Vande Bharat- 25 New Features) కలిగి ఉంటాయి.
Also read :New Political Party : ఏపీలో మరో కొత్త పార్టీ.. ఈ నెల 23 న “ప్రజా సింహగర్జన” పార్టీ ఆవిర్భావం
వందే భారత్ రైళ్లలో కొత్త ఫీచర్లు ఇవే..
- ట్రైన్ లోని సీటును వెనుక వైపునకు వంచే యాంగిల్ ను ఇంకొంత పెంచారు.
- సీట్లపై మరింత మెరుగైన కుషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
- మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ప్యాసింజర్లకు కంఫర్ట్ గా చేతికి అందేలా సెట్టింగ్స్ మారుస్తున్నారు.
- వందేభారత్ లోని ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ల లో ఫుట్‌రెస్ట్‌ల వెడల్పును ఇంకొంత పెంచుతున్నారు.
- నీళ్లు పొంగి పొర్లకుండా ఉండేందుకు వాష్ బేసిన్ లోతును పెంచుతున్నారు.
- టాయిలెట్లలో లైటింగ్ ను మరింత బెటర్ చేస్తున్నారు.
- డ్రైవింగ్ ట్రెయిలర్ కోచ్‌లలో దివ్యాంగులైన ప్రయాణికులు ఉపయోగించే వీల్‌చైర్‌లకు ఫిక్సింగ్ పాయింట్లను ఏర్పాటు చేసున్నారు.
- బుక్ కానీ .. వస్తువు కానీ.. మనిషి శరీరం కానీ దగ్గరికి రాగానే ఆన్ అయ్యేలా రీడింగ్ ల్యాంప్ లో సెన్సర్లు అమర్చారు.
- రోలర్ బ్లైండ్ ఫాబ్రిక్ ను ట్రైన్ లోపల వినియోగించారు.
- కొత్తగా యాంటీ క్లైంబింగ్ పరికరాన్ని కూడా ప్రతి రైలు బోగీ అంచుల్లో అమరుస్తున్నారు.