The Kashmir Files: మోడీ మెచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’
మన తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తొలి బాలీవుడ్ వెంచర్ `ది కాశ్మీర్ ఫైల్స్.
- By Balu J Published Date - 11:02 AM, Mon - 14 March 22
మన తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తొలి బాలీవుడ్ వెంచర్ `ది కాశ్మీర్ ఫైల్స్. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు మన గౌరవప్రదమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకోవడం గొప్ప విశేషమే కాదు గర్వం కూడా. అవును. నిజం ఎందుకంటే కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలసలను వర్ణించే చిత్రాన్ని రూపొందించడానికి సాహసించినందుకు వారిని ఆశీర్వదించాలని చిత్రనిర్మాతలకు ప్రధాని నుంచి పిలుపు వచ్చింది. ప్రధానిని కలిసిన వారిలో వివేక్, అభిషేక్‌లతో పాటు నటి పల్లవి జోష్ కూడా వున్నారు.
నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధానిని సత్కరించారు. ప్రధానమంత్రి ఒక చిత్రాన్ని అభినందించడం, అది టీమ్‌కి అద్భుతమైన ఫీట్‌గా తెలిపారు. మరోవైపు, అన్నిచోట్ల కాశ్మీర్ ఫైల్స్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ బిజినెస్ చేస్తోంది. మౌత్ టాక్‌తో మొదటి రోజు కంటే రెండోరోజు నుంచి ఆదరణ మరింతగా పెరిగింది. ఈ సినిమా పై అన్ని ప్రాంతాల నుండి వచ్చిన రెస్పాన్స్‌తో సంతోషించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన బ్యానర్లో కొన్ని ఆలోచనలను రేకెత్తించే, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారు.
Related News
Shah Rukh Khan: బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కు నో చెప్పిన షారుక్ ఖాన్, కారణమిదే
Shah Rukh Khan: ఐదేళ్ల గ్యాప్ తీసుకున్న తర్వాత, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 2023లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తిరిగి వచ్చాడు. అతని యాక్షన్ చిత్రాలైన పఠాన్ మరియు జవాన్ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. SRK ఇటీవల విడుదలైన డుంకీ కూడా 450 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ద్వారా మంచి వసూళ్లను సాధించింది. బాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనం �