508 Stations-PM Modi : 27 రాష్ట్రాల్లో 508 రైల్వే స్టేషన్ల మోడర్నైజేషన్.. ప్రధాని మోడీ శంకుస్థాపన
508 Stations-PM Modi : వచ్చే 50 ఏళ్లలో దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్" లో కీలక ముందడుగు పడింది.
- By Pasha Published Date - 12:50 PM, Sun - 6 August 23

508 Stations-PM Modi : వచ్చే 50 ఏళ్లలో దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో కీలక ముందడుగు పడింది. తొలివిడతగా దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 508 రైల్వే స్టేషన్ల ను మోడర్నైజ్ చేసే పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.
Also read :TSRTC Merger Bill : అయ్యో…ఆర్టీసీ (RTC) విలీనం బిల్లు లేనట్లేనా..?
ఈ 508 రైల్వే స్టేషన్లలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో చెరో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22 ఉన్నాయి. గుజరాత్మ, తెలంగాణలో చెరో 21, జార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో చెరో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా డెవలప్ చేయనున్నారు. ఈవివరాలను ప్రధానమంత్రి కార్యాలయం(508 Stations-PM Modi) వెల్లడించింది. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.24,470 కోట్లు. దీని ద్వారా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. రైల్వే స్టేషన్ల భవనాలను స్థానిక సంస్కృతి, కళలు, వాస్తుశిల్పం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారు.