Bank Holidays : బ్యాంకు లో పని ఉంటె ఈరోజు చూసుకోండి..లేదంటే ఇబ్బంది పడతారు
Bank Holidays : ఏప్రిల్ 12 నుంచి 14 వరకు దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో వినియోగదారులు తమ బ్యాంకింగ్ అవసరాలను ముందుగానే
- Author : Sudheer
Date : 11-04-2025 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
బ్యాంకు (Bank ) లో మీకు పని ఉందా..? అయితే ఈరోజే చూసుకోండి. ఎందుకంటే రేపటి నుండి మూడు రోజులు బ్యాంకు లకు సెలవులు( 3 days Bank Holidays). ఏప్రిల్ 12 నుంచి 14 వరకు దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో వినియోగదారులు తమ బ్యాంకింగ్ అవసరాలను ముందుగానే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నగదు ఉపసంహరణలు, చెక్కుల క్లియరెన్స్, ఖాతా సంబంధిత లావాదేవీలు చేయాలనుకునే వారు వెంటనే తమ పనులు పూర్తి చేసుకోవాలని అంటున్నారు.
Glowing Face: రాత్రి పడుకునే ముందు ఈ ఐదు రకాల పనులు చేస్తే చాలు.. మీ ముఖం తలతల మెరిసిపోవాల్సిందే?
ఏప్రిల్ 12న రెండవ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. అనంతరం ఆదివారం (ఏప్రిల్ 13) సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, కేరళలో విషు, తమిళనాడులో పుత్తండు (తమిళ నూతన సంవత్సరం), అస్సాంలో బిహు వంటి పండుగల నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అయితే మధ్యప్రదేశ్, చండీగఢ్, ఢిల్లీ, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు తెరిచి ఉంటాయి. మూడు రోజులు బ్యాంకులకు సెలవులు అయినప్పటికీ ఏటీఎం సేవలు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. కాకపోతే ATM లలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే చెక్కుల క్లియరెన్స్, డ్రాఫ్ట్‌లు, ఇతర కౌంటర్ సేవలు ఈ సెలవుల్లో అందుబాటులో ఉండవు. కనుక చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా, మీ అవసరాల కోసం ఏప్రిల్ 11ను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.