Mahatma Gandhi on Martyrs’ Day : గాంధీకి నివాళులర్పిస్తూ చప్పట్లు కొట్టిన సీఎం నితీశ్
Mahatma Gandhi on Martyrs' Day : మహాత్ముడి స్మారకానికి నివాళులర్పించిన (clapped during a tribute) అనంతరం చప్పట్లు కొట్టడం ఆయనకు తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టింది
- By Sudheer Published Date - 04:03 PM, Thu - 30 January 25

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి (Mahatma Gandhi on Martyrs’ Day) సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar Chief Minister Nitish Kumar) చేసిన పని వివాదాస్పదంగా మారింది. మహాత్ముడి స్మారకానికి నివాళులర్పించిన (clapped during a tribute) అనంతరం చప్పట్లు కొట్టడం ఆయనకు తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
BJP : చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం
సీఎం నితీశ్ కుమార్ గాంధీకి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత చప్పట్లు కొట్టారు. ఇది గమనించిన బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఆయనకు సైగ చేశారు. దాంతో వెంటనే సీఎం తన పని తప్పుగా మార్గం తప్పిందని గ్రహించి చప్పట్లు ఆపేశారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. గాంధీ వర్ధంతిని “సంతాప దినంగా” పాటిస్తారు. అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి నితీశ్ చప్పట్లు కొట్టడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జాతీయవాదులు, కాంగ్రెస్ నేతలు, సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో సీఎం తీరును తప్పుబడుతున్నారు. “గాంధీ మరణించిన రోజున మౌనం పాటించాల్సింది పోయి చప్పట్లు కొడతారా?” అంటూ నితీశ్‌పై మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఇంకా సీఎం నితీశ్ కుమార్ స్పందించలేదు. కానీ ఆయన తప్పు తెలుసుకుని చప్పట్లు ఆపేయడం, స్పీకర్ స్పందించడం చూస్తే ఇది అనుకోకుండా జరిగిందని తెలుస్తుంది. సామాన్యంగా ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో నేతలు జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. కానీ నితీశ్ చేసిన ఈ చిన్న తప్పిదం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.
Bihar CM Nitish Kumar starts clapping after paying tributes to MK Gandhi.
Assembly Speaker Nand Kishore Yadav signals him to stop. pic.twitter.com/PeQvlrAW6f
— News Arena India (@NewsArenaIndia) January 30, 2025