274 Jobs : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 274 జాబ్స్
274 Jobs : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్)లోని వివిధ కేటగిరీల్లో 274 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(274 Jobs) రిలీజ్ అయింది.
- By Pasha Published Date - 11:21 AM, Sat - 30 December 23

274 Jobs : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్)లోని వివిధ కేటగిరీల్లో 274 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(274 Jobs) రిలీజ్ అయింది. వీటిలో 28 డాక్టర్ (ఎంబీబీఎస్) పోస్టులు, 20 లీగల్ పోస్టులు, 30 ఫైనాన్స్ పోస్టులు, 2 యాక్చుయేరియల్ పోస్టులు, 20 ఇనఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులు, 20 ఆటోమొబైల్ ఇంజినీర్స్ పోస్టులు, 22 హిందీ(రాజ్యభాషా) ఆఫీసర్స్ పోస్టులు, 130 జనరలిస్ట్ పోస్టులు, 2 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. వీటిలో పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ, పీజీ – మెడికల్ డిగ్రీ, లా, బీ.కామ్, ఎం.కామ్, బీఈ, బీటెక్, ఎం.టెక్ విద్యార్హతలను అభ్యర్థులు కలిగి ఉండాలి. హిందీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో హిందీ లేదా ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులను పొంది ఉండాలి.21 నుంచి 30 ఏళ్లలోపు అభ్యర్థులు అప్లై చేయొచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జనవరి 2న మొదలై జనవరి 22 వరకు కొనసాగుతుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.250, ఇతర కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1000గా ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, హిందీ ఆఫీసర్ పోస్టులకు ఎటువంటి ప్రిలిమ్స్ పరీక్ష ఉండదు. పూర్తి వివరాలను ఎన్ఐసీఎల్ అధికారిక వెబ్సైట్ nationalinsurance.nic.co.in లో తెలుసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
అప్లై చేయడం ఇలా..
- ఎన్ఐసీఎల్ వెబ్సైట్ nationalinsurance.nic.co.inలోకి లాగిన్ కావాలి.
- హోంపేజీపై కనిపించే ఆన్‌లైన్ అప్లికేషన్ లింకుపై క్లిక్ చేయండి.
- ఫోన్ నంబర్ సహా అడిగిన వివరాలన్నీ అందించి రిజిస్టర్ చేసుకోండి.
- దరఖాస్తు ఫామ్‌ను నింపండి. కావాల్సిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజును పే చేయండి.
- సబ్మిట్ బటన్ నొక్కే ముందు అప్లికేషన్ ఫామ్‌ను చెక్ చేసుకోండి.
- దరఖాస్తు ఫారాన్ని జిరాక్స్ తీసి పెట్టుకోండి.
Also Read: Israel Vs South Africa : అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా కేసు.. ఎందుకు ?