Mumbai Airport Suspension:ముంబై విమానాశ్రయం.. ఆ రోజు ఆరు గంటలు బంద్!!
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశంలోనే అత్యంత రద్దీ అయినది.
- By Hashtag U Published Date - 01:01 PM, Fri - 23 September 22

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశంలోనే అత్యంత రద్దీ అయినది. ఇది అక్టోబర్ 18న ఆరు గంటల పాటు పనిచేయదు. ఆ రోజున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రన్‌వేలను మూసివేయనున్నారు. అక్టోబర్ 18న ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని రెండు రన్వేలు(9/27- 14/32) మూసేస్తామని వెల్లడించింది. దీనిపై ముంబై ఎయిర్పోర్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక పండుగ సీజన్ సమీపిస్తుం డటంతో.. ముంబై విమానాశ్రయంలో రద్దీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి ప్రతిరోజు 800 కుపైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. విమానాశ్రయం నిర్వహణ పనుల కోసం అక్టోబర్ 18న 6 గంటల పాటు రన్ వేస్ బంద్ చేస్తారు. సాధారణంగా రుతుపవనాల సమయం ముగిసిన తర్వాత ఎయిర్ పోర్ట్ నిర్వహణ పనులు చేస్తూ ఉంటారు. ఈసారి అక్టోబర్ 18న ఈ కార్యకలాపాలు చేపట్టారు ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది. ప్రయాణికులు, విమానాల భద్రత కోసం ఇలాంటి నిర్వహణ పనులు చేస్తారు. ముంబై విమానాశ్రయం రన్‌వేల మూసివేతతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు. పలు విమానాల సర్వీసులను ఇప్పటికే రీషెడ్యూల్ చేశారు. ఫలితంగా మెయింటేనెన్స్కి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ విషయంలో ప్రయాణికుల నుంచి సహకారాన్ని ఆశిస్తున్నట్టు ముంబై ఎయిర్పోర్ట్ అభిప్రాయపడింది. ముంబై విమానాశ్రయంలో అదానీ గ్రూప్‌నకు 74శాతం వాటా ఉంది. 2022 సెప్టెంబర్ 17న.. 1,30,374మంది ప్రయాణికులు ఈ ముంబై విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. ఇదొక రికార్డు. 95,080మంది ప్రయాణికులు టర్మినల్ 2 ద్వారా ప్రయాణాలు చేశారు. 35,294 మంది.. టర్మినల్ 1 నుంచి ప్రయాణించారు. ఆ ఒక్క రోజులో 839 విమానాలు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాయి.
Tags
- Chhatrapati Shivaji Maharaj International Airport
- mumbai airport
- runway maintenance work
- six hours on October 18

Related News

Mumbai Airport: రన్‌వే పై స్కిడ్ అయిన ప్రవేట్ జెట్..
ముంబై విమానాశ్రయంలో రన్‌వే 27లో ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయ్యింది