Toilet Cleaning Issue: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల చేత టాయిలెట్ క్లీనింగ్..
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో భోజనాన్ని వడ్డించడం వివాదాస్పదం అయింది. దీనిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
- By Hashtag U Published Date - 11:34 PM, Thu - 22 September 22

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో భోజనాన్ని వడ్డించడం వివాదాస్పదం అయింది. దీనిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు టాయిలెట్లను క్లీన్ చేయడం వివాదాస్పదం అయింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థ లోపాలు తరుచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఈ వివాదంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సీరియస్ అంది. మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని
బాలికలు 5,6 తరగతి విద్యార్థులుగా గుర్తించారు. వారు చేతుల్లో చీపుర్లు పట్టుకుని పాఠశాలలోని టాయిలెట్లను శుభ్రం చేయడం ఫోటోల్లో చూడవచ్చు. విద్యాశాఖ గురువారం పాఠశాల చేరుకుని విచారణ జరిపింది. పాఠశాల ప్రిన్సిపాల్ అధికారిక సమావేశానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.