Modi Special Turban : తొమ్మిదిసార్లు జెండా ఎగురవేసిన ప్రధాని…ప్రతిసారి స్పెషల్ తలపాగాతో..!!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు జాతీయ జెండాను ఎగురవేశారు.
- By hashtagu Published Date - 12:17 PM, Mon - 15 August 22

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే కార్యక్రమం ఏదైనా సరే తన వస్త్రాధారణతో స్పెషల్ గా కనిపిస్తారు మోదీ. సంప్రదాయ దుస్తువులను ధరించి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తారు. అయితే తొమ్మిదిసార్లు జరిగిన స్వాతంత్య్రదినోవత్సవాల్లో మోదీ ధరించిన తలపాగాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇవాళ ధరించిన తలపాగాతో అది మరింత హాట్ టాపిగ్ గా మారింది.
* 2014లో ప్రధాన మోదీ క్రీమ్ కలర్ డ్రస్ ధరించారు. రెడ్ కలర్ తలపాగాకు గ్రీన్ కలర్ బార్డర్ ఉంది.
*2015లో క్రీమ్ కలర్ కుర్తాపై జాకెట్ వేసుకున్నారు. ఆరెంజ్ కలర్ పగడీపై గ్రీన్, రెడ్, బ్లూ కలర్ గీతలున్న తలపాగాను ధరించారు.
*2016లో వైట్ కుర్తా..రెడ్, పింక్, కలర్స్ తలపాగా ధరించారు.
*2017లో క్రీమ్ కలర్ కుర్తా..రెడ్, ఆరెంజ్ కలర్స్ లో ఉణ్న తలపాగా ధరించారు మోదీ
*2018లో ఆరెంజ్ కలర్ లో ఉన్న ప్లెయిన్ తలపాగాను ధరించారు.
*2019లో రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్స్ కాంబినేషన్ లో ఉన్న తలపాగా ధరించారు.
*2020లో కాషాయం ఎల్లో కలర్ తలపాగాను వేసుకున్నారు.
*2021లో కాషాయం కలర్ పై రెడ్ కలర్ చెక్స్ ఉన్న తలపాగాను ధరించారు.
*2022 ఇవాళ వైట్ కలర్ కుర్తాపై బ్లూ కలర్ జాకెట్ ధరించి…గ్రీన్, ఆరెంజ్ కలర్ గీతున్న తలపాగాను ధరించారు మోదీ.