Mount Everest 70 Years : ఎవరెస్ట్ ఫస్ట్ హీరోల సక్సెస్ సీక్రెట్ ఇదే..
ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం అంటే ఆషామాషీ విషయం కాదు.. 8,848.86 మీటర్ల ఎత్తున ఉండే ఎవరెస్ట్ శిఖరాన్నితాకిన క్షణాన పర్వతారోహకులు పొందే ఆనందం అంతాఇంతా కాదు.. తొలిసారిగా ఈ అనుభూతిని న్యూజిలాండ్ దేశస్థుడు ఎడ్మండ్ హిల్లరీ, షెర్పా టెన్జింగ్ నార్గే సొంతం చేసుకున్నారు. సరిగ్గా 70 ఏళ్ళ క్రితం(Mount Everest 70 Years) 1953 మే 29న ఈ ఘట్టం చోటుచేసుకుంది.
- By Pasha Published Date - 07:28 AM, Mon - 29 May 23
ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం అంటే ఆషామాషీ విషయం కాదు..
8,848.86 మీటర్ల ఎత్తున ఉండే ఎవరెస్ట్ శిఖరాన్నితాకిన క్షణాన పర్వతారోహకులు పొందే ఆనందం అంతాఇంతా కాదు..
తొలిసారిగా ఈ అనుభూతిని న్యూజిలాండ్ దేశస్థుడు ఎడ్మండ్ హిల్లరీ, షెర్పా టెన్జింగ్ నార్గే సొంతం చేసుకున్నారు.
సరిగ్గా 70 ఏళ్ళ క్రితం(Mount Everest 70 Years) 1953 మే 29న ఈ ఘట్టం చోటుచేసుకుంది.
కానీ మనలో చాలామందికి ఎవరెస్టు ఎక్కిన ఫస్ట్ హీరో ఎడ్మండ్ హిల్లరీ లైఫ్ తో ముడిపడిన ఆసక్తికర వివరాలు తెలియదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఎడ్మండ్ హిల్లరీ.. న్యూజిలాండ్ లో తేనెటీగలు పెంచే పని చేసేవాడు. అతడు ఎవరెస్టు ఎక్కడం అనేది రాత్రికి రాత్రి జరగలేదు. వాస్తవానికి 1930వ దశకం నుంచే అతడు ఎవరెస్టు శిఖరం ఎక్కే ప్రయత్నాలను మొదలు పెట్టాడు. 1930వ దశకం నుంచి 1953 వరకు 6సార్లు ఎవరెస్టు శిఖరపు అంచులను తాకేందుకు ఎడ్మండ్ హిల్లరీ ట్రై చేశాడు.. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. అయినా వెనుకంజ వేయలేదు. ఓటముల వెంటే విజయం ఉంటుందని నమ్మాడు. ప్రయత్నించే వాడు ఓడిపోడు అని నమ్మాడు. అందుకే 1952లో ఒక గట్టి ప్రయత్నం చేశాడు.. అయితే దాదాపు ఎవరెస్టు శిఖరం వరకు వెళ్లినా పూర్తిగా చేరలేకపోయాడు ఎడ్మండ్ హిల్లరీ.అయినా అతడు ఓటమిని అంగీకరించలేదు. ఒక ఏడాది గ్యాప్ ఇచ్చాడు. వైఫల్యాలకు కారణాలను విశ్లేషించుకున్నాడు. 1953 మే నెలలో(Mount Everest 70 Years) మళ్ళీ ఎవరెస్టు శిఖరం దిశగా కదిలాడు. అతడికి ఎవరెస్టు అంచులు తప్ప ఇంకేం కనిపించలేదు. చివరకు మే 29న చారిత్రక ఘట్టం ఆవిష్కృతం అయింది. ఎవరెస్టు ఎక్కినా తొలి హీరోగా ఎడ్మండ్ హిల్లరీ అవతరించాడు. ఆ సమయంలో అతడి వెంట షెర్పా టెన్జింగ్ నార్గే కూడా ఉన్నారు.
Also read : Mount Everest 70 Years : ఎవరెస్ట్ ఫస్ట్ హీరోల సక్సెస్ సీక్రెట్ ఇదే..
అప్పటికీ .. ఇప్పటికీ తేడా
ఎడ్మండ్ హిల్లరీ టైంలో ఎవరెస్టు ఎక్కే వారికి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు బేస్ క్యాంప్ నుంచి శిఖరం పైవరకు వెళ్ళడానికి సపోర్ట్ గా తాడు ఉంటుంది. మంచు పగుళ్ల మీదుగా వెళ్లడానికి నిచ్చెనలు ఉన్నాయి. క్యాంపులలో వేడివేడి టీ అందించే షెర్పాలు ఉంటున్నారు. 6,300 నుంచి 6,500 మీటర్ల ఎత్తువరకు కూడా రక్షించేందుకు వీలుగా హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే .. గత 100 ఏళ్లలో 300 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నంలో మరణించారు. ఈ ఏడాది సీజన్లోనూ మృతుల సంఖ్య 11కి చేరింది.
Tags
Related News
Everest Man : ‘ఎవరెస్ట్ మ్యాన్’.. 29వసారీ ఎవరెస్టును ఎక్కేశాడు
Everest Man : అత్యంత ఎత్తయిన పర్వతం ఎవరెస్టు. దీన్ని అధిరోహించడం అంటే ఆషామాషీ విషయమేం కాదు.