Vande Matram: ఫోన్ రాగానే హలో కాదు.. వందేమాతరం అనాల్సిందే.. ఎక్కడంటే..?
మనమందరం ఫోన్ రాగానే హలో అని అంటాం. అయితే ఇకపై హలో అనకూడదని.. హలో స్థానంలో వందేమాతరం చెప్పాలని ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- By Hashtag U Published Date - 07:25 PM, Sun - 2 October 22

మనమందరం ఫోన్ రాగానే హలో అని అంటాం. అయితే ఇకపై హలో అనకూడదని.. హలో స్థానంలో వందేమాతరం చెప్పాలని ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ హలో అని ఎందుకు చెప్పకూడదో..? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హలోకి బదులు వందేమాతరం చెప్పాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది రాష్ట్రంలోని అందరూ పాటించాల్సిన పనిలేదు. మహరాష్ట్రలోని ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధన పాటించాల్సి ఉంది. ఇకపై వారు ఫోన్ వస్తే హలోకు బదులు వందేమాతరం చెప్పాల్సిందే. దీనిపై ఆగస్ట్‌లోనే ఆ రాష్ట్ర మంత్రి సుధీర్ ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో మొబైల్, టెలిఫోన్లకు ప్రజలు లేదా ఉన్నతాధికారుల నుంచి కాల్స్ వస్తే వందేమాతరం అనాలని పేర్కొంది. హలో అనేది పాశ్చాత్య సంస్కృతి అని, దానికి ఎలాంటి అర్థం లేదని ప్రభుత్వం పేర్కింది.