Love Marriage: బావిలో దూకేసిన ప్రియుడు.. చివరికి ప్రియురాలితో పెళ్లి పీటల మీదకు!
ప్రేమ వ్యవహారం బయటపడటంతో బావిలోకి దూకిన ప్రియుడు.. గ్రామస్తులు చివరకు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు.
- Author : Anshu
Date : 13-12-2022 - 8:25 IST
Published By : Hashtagu Telugu Desk
Love Marriage: ఓ యువకుడు చేసిన పనితో చివరికి అతడు ప్రయత్నం ఫలించింది. అతడు చేసిన పనితో తాను అనుకున్న పని పూర్తయింది. తన ప్రేయసిని దక్కించుకోవాలన్న అతడి కోరిక కూడా నెరవేరింది. తన ప్రియురాలిని దక్కించుకోవాలని అతడు చేసిన ప్రయత్నం చివరికి ట్విస్ట్‌ల మధ్య నెరవేరింది. తన ప్రియురాలు కోసం ఓ ప్రియుడు ఏం చేయాలనుకున్నాడు? చివరి ఏం జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం.
బిహార్‌కు చెందిన ఓ యువకుడు తన గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. గత కొన్నేళ్లుగా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రియురాలి ఇంటికి వెళ్లి ప్రియుడు రోజూ వెళ్లి కలిసేవాడు. అలాగే ఒకరోజు రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అయితే శబ్దం రావడంతో ప్రియురాలు ఇంట్లోని కుటుంబసభ్యులు నిద్రలేచారు. దీంతో ప్రియుడు వెంటనే పరుగులు పెట్టాడు. వెంటనే ప్రియురాలి కుటుంబసభ్యులు గమనించి అతడిని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు.
అయితే ప్రియురాలి కుటుంబసభ్యులకు దొరికితే ప్రేమ వ్యవహారం గుట్టురట్టు అవ్వడంతో పాటు కొడతారేమోననే భయంతో బావితో దూకేశాడు. దీంతో గ్రామస్తులందరూ కలిసి యువకుడిని బయటకు తీసి ప్రేమ వ్యవహారం గురించి ఆరా తీశారు. తాము గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అమ్మాయిని కలవడానికే ఇంటికి వెళ్లినట్లు బయటపెట్టాడు. దీంతో గ్రామస్తులు యువతి కుటుంబసభ్యులతో మాట్లాడి ఇద్దరి పెళ్లికి ఒప్పించారు.
గ్రామంలోని దేవాలయంలో ఈ ప్రేమ జంట పెళ్లి చేశారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే గ్రామస్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ప్రియురాలిని కలుసుకోవాలని ఈ ప్రియుడు చేసిన ప్రయత్నం చివరికి ట్విస్ట్ ల మధ్య ఇలా సక్సెస్ అయింది. బావిలో దూకడంతో అతడి ప్రేమ వ్యవహారం బయటపడంతో.. ఇద్దరికి పెళ్లి చేశారు. ప్రేమ వ్యవహారం బయటపడితే తన పని అయిపోతుందని బావిలో దూకి అతడు చేసిన సాహసం చివరికి ఇలా వర్కౌట్ అయిందని కొంతమంది చెబుతున్నారు. మొత్తానికి ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.