Traffic Jam : ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్..ఎక్కడంటే..!!
Traffic Jam : ప్రయాగరాజ్ వెళ్లే రహదారులన్నీ వాహనాలతో నిండిపోవడంతో ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి గంటల సమయం పడుతోంది
- By Sudheer Published Date - 09:36 PM, Mon - 10 February 25

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh)కు భక్తులు భారీగా తరలివస్తుండటంతో రహదారులు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఈ భక్తుల రద్దీ కారణంగా ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు దాదాపు 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నెటిజన్లు దీన్ని “ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్”(Longest Traffic Jam)గా అభివర్ణిస్తున్నారు.
ప్రయాగరాజ్ వెళ్లే రహదారులన్నీ వాహనాలతో నిండిపోవడంతో ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి గంటల సమయం పడుతోంది. ముఖ్యంగా ప్రయాగరాజ్ నుండి మధ్యప్రదేశ్‌లోని కట్ని, మైహార్, జబల్‌పూర్ నగరాల వరకు రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. భక్తులు గంటల తరబడి ట్రాఫిక్ క్లియర్ అవ్వకపోవడంతో వెనక్కి వెళ్లాలనుకుంటున్నామని పోలీసులకు చెబుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడం కష్టంగా మారడంతో పోలీసులు ప్రయాగరాజ్‌కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్ని ప్రాంతం నుంచి భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు అక్కడికక్కడే వాహనాల వద్దే సేద తీరుతున్నారు. సోషల్ మీడియాలో ట్రాఫిక్ జామ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. భక్తుల రద్దీతో ప్రయాణం మరింత కష్టతరం కావడంతో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు ముందుగా ట్రాఫిక్ పరిస్థితిని తెలుసుకుని బయలుదేరాలని సూచనలు అందుతున్నాయి.
#mahakumbh मे भारी संख्या में लोग आने से भीड़ और ट्रैफिक की समस्या उत्पन्न हो रही है। अपने वाहनों के साथ यात्रा करने वाले यात्रीगण, कृपया ध्यान दें कि #Kanti से #Prayagraj तक 270 किलोमीटर लंबा ट्रैफिक जाम लग गया है। आप सभी से विनम्र निवेदन है कि यदि संभव हो, #MahaKumbhMela2025 pic.twitter.com/XAZy8siHmK
— Hitesh Dubey – People's Voice (@HiteshForChange) February 9, 2025
Stuck in traffic for past 3 hours on the way to Maha kumbh mela
No response from the concerned authorities to make the situation any better for all the people going through this ordeal. Would you request kumbh authorities to take required action pic.twitter.com/DtHTCRMIuM— Neeraj (@neerajt86612028) February 9, 2025