BJP MP Upendra Singh : రాసలీలల వీడియో నాకు పంపించండి చూస్తాను – నటి కస్తూరి
- Author : Sudheer
Date : 05-03-2024 - 8:29 IST
Published By : Hashtagu Telugu Desk
సోషల్ మీడియా లో బీజేపీ MP ఉపేంద్ర సింగ్ రావత్ (BJP MP Upendra Singh) కు సంబదించిన ఓ స్క్రీన్ షాట్ పిక్ వైరల్ (Viral Video) గా మారింది. త్వరలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ కి చెందిన వ్యక్తి కి సంబదించిన రాసలీలల పిక్ బయటకు రావడం తో ఆ వీడియో ఎక్కడ ఉందా అని అంత సెర్చ్ చేయడం మొదలుపెడుతున్నారు. దీనిని బేస్ చేసుకొని ఇతర పార్టీలు బీజేపీపై విమర్శలు కురిపించడం మొదలుపెట్టారు. దీనిపై నటి కస్తూరి స్పందించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇది ఫేక్ అని ఉపేంద్ర సింగ్ రావత్ ఆరోపిస్తున్నా కూడా ఇది అసలు ఫేక్ కాదంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను తన ట్విటర్‌లో షేర్ చేసింది. ‘అందరూ ఉపేంద్ర సింగ్ రావత్‌కు సంబంధించిన ఈ వీడియోలను చూశారు. వీడియో వైరల్ అయ్యిందని చెప్తున్నారు. ఆ వీడియో ఎక్కడ చూడాలి? ఎవరైనా లింక్ పంపించండి ప్లీజ్’ అంటూ వ్యంగ్యంగా కస్తూరి పోస్ట్ చేయడంతో ఇంకాస్త దీని గురించి అంత మాట్లాడుకుంటున్నారు.
ఇదిలా ఉంటె ఈ పిక్ ఫై ఉపేంద్ర సింగ్ రావత్ స్పందించారు. ‘డీప్‌ఫేక్ ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన నా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించి నేను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను’ అని ట్విటర్ ద్వారా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆ వీడియోలో ఉన్నది తను కాదని నిరూపణ అయ్యేవరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయను అంటూ ప్రకటించారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఒక అనుమానితుడిని గుర్తించినట్టు సమాచారం. కానీ అతడి వివరాలు బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్తపడుతున్నారు.
Read Also : AP : జగన్..బీసీల పొట్టకొట్టాడు – జయహో సభలో పవన్ కీలక వ్యాఖ్యలు