Jobs in Coal Mining Sector : కేవలం డిగ్రీ అర్హతతో బొగ్గు గనుల విభాగంలో ఉద్యోగాలు
Jobs in Coal Mining Sector : కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది
- By Sudheer Published Date - 02:37 PM, Sun - 27 October 24

భారత ప్రభుత్వ బొగ్గు గనుల (Coal Mining Sector) మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు చూస్తే..
పోస్టులు: మేనేజ్‌మెంట్ ట్రైనీ (E-2 గ్రేడ్)
మొత్తం ఖాళీలు: 640
జనరల్: 190
ఈడబ్ల్యూఎస్: 43
ఎస్సీ: 67
ఎస్టీ: 34
ఓబీసీ: 124
విభాగాల వారీగా ఖాళీలు
మైనింగ్: 263
సివిల్: 91
ఎలక్ట్రికల్: 102
మెకానికల్: 104
సిస్టమ్: 41
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్: 39
అర్హతలు
కనీసం 60% మార్కులతో మైనింగ్/సివిల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఐటీ/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో BE/B.Tech లేదా MCA.
GATE 2024లో అర్హత సాధించాలి.
అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు (సెప్టెంబర్ 30, 2024).
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబర్ 29, 2024
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 11, 2024
నవంబర్ 28, 2024వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయాలి.
ఫీజులు
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.1180
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు: ఫీజు మినహాయింపు.
జీతం
ఎంపికైన వారికి నెలకు రూ.50,000 నుండి రూ. 1,60,000 వరకు జీతం అందించబడుతుంది.