Milk History: క్షీర విప్లవం కథ ఈనాటిది కాదు.! వేల ఏళ్ల పోరాటం..!
సుమారు 10 వేల సం.ల క్రితం నుండి మాత్రమే ఈ పెంపుడు జంతువుల పాలకు మానవులు అలవాటు పడ్డారు. ఒక్కొక్కటిగా ఆవు , గేదె , మేక, గొర్రె పాలను ఆహారంలో భాగం గా తీసుకోవడం మొదలు పెట్టారు.
- By CS Rao Published Date - 11:20 AM, Sun - 15 January 23

సుమారు 10 వేల సం.ల క్రితం నుండి మాత్రమే ఈ పెంపుడు జంతువుల పాలకు మానవులు అలవాటు పడ్డారు. ఒక్కొక్కటిగా ఆవు , గేదె , మేక, గొర్రె పాలను ఆహారంలో భాగం గా తీసుకోవడం మొదలు పెట్టారు . వేద కాలం నుండీ ఆవు పాల గురించి ఉంది . భారత ఉపఖండం లో 13 వ శతాబ్ధం వరకు నివసించిన బాస్ ప్రిమిజెనియస్ అనే ఆదిమ జాతి పశువుల నుండి నేటి దేశవాళి ఆవులు వృద్ధి చెందాయని శాస్త్రజ్ఞులు చెబు తున్నారు. ప్రపంచ రికార్డుల్లో మొదట సుమేరియన్లు పాలను ఆహారంగా వినియో గించారని తెలుస్తోంది. భారత పురాణాలు , ఇతిహాసాల్లో గోవు గురించి , గోపాలుడు అనే కృష్ణుడు గురించి మహా భారతంలో కథలు , గోవుల గురించి యుద్ధాలు జరిగిన సంఘటనలు మనం చదివి యున్నాం. ఆ కాలంలో సంపద అంటే పశువులే. అవే యుద్ధా లకు మూలం కూడా అయ్యేవి. ఐరోపా దేశాల్లో పారిశ్రామిక విప్లవం 1830 తరువాత , గ్రామాల నుండీ పట్టణాలకు పాల తరలింపుకు రవాణా ఏర్పడింది . నిదానంగా సాంకేతికతకు అభివృద్ధి చెందుతూ వచ్చింది . 1860 లో నెదర్లాండ్ లో మెకానికల్ కూలర్ కనుగొనడంతో సాంద్ర డెయిరీ పరిశ్రమకు పునాదులు పడ్డాయి . 1864 లో ఫ్రెంచ్ మైక్రో బయాలజిస్ట్ లూయీస్ పాశ్చర్ పాలశీతలీ కరణ ప్రక్రియను మొదటగా కనుగొన్నాడు .
1880 లో అటస్టె గాలిన్ , హోమోజె నైజేషన్ కనుగొన్నాడు . దానితో స్కిం మిల్క్ , లో ఫాట్ మిల్క్ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తి తయారీ మొదలైనది . ఈ ఆవిష్కరణల మూలంగా పాల నాణ్యత దెబ్బతిన కుండా , నిల్వచేయడం , దూర ప్రాంతాలకు తరలించడం సులభతర మైనది . ఈ విధంగా అంతర్జాతీయంగా కూడా పాల ఉత్పత్తుల తయారీకి శ్రీకారం చుట్టి , తద్వారా ఒక పరిశ్రమగా రూపాంతరం చెందింది. రాను రాను మన భారత్ లో కూడా పాల ద్వారా సంపద సృష్టించడం మొదలయ్యింది. వ్యవసాయం లేకపోయినా గేదో , ఆవునో పెట్టుకుని పాల ద్వారా వచ్చే ఆదాయంతో రోజు వారీ కుటుంబ అవసరాలను నెట్టుకు వచ్చేవారు . అదే దిన దినాభివృద్ధి చెంది నేడు 15 కోట్ల చిన్న రైతులు సహకార సంఘాలుగా ఏర్పడి , పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, ప్రపంచ అగ్రగామిగా నిలబడ్డాం . వ్యవసాయం , దాని అనుబంధ రంగాల స్థూల జాతీయోత్పత్తిలో పశు వుల వాటా 25 % గా ఉంది . ఇందులో షుమారు 70% వాటా పాల నుండి సమకూరు తున్నదట. పాలకు ఇంతగా ప్రాముఖ్యత లభించడానికి ముఖ్యకారణం పాలపొడి.
ఈ పాలపొడి తయారీ తరువాతే పాల ఉత్పత్తి అనేది ఒక పరి శ్రమగా గుర్తించడం మొదలై నది. ఈ పాలపొడిని భారత్ లో మొదటగా తాయారు చేసింది శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్. దీని తయారీ విధానం ఆయనకు అంత తొందరగా లభించలేదు. విదే శాలలో పాలు ఆవుల ద్వారా సమకూరుతుంది . కానీ మన భారత్ లో గేదెలు ఎక్కువుగా ఉన్నాయి . ఆవుపాల ఉత్పత్తిలో పేరెన్నిక గలవారు న్యూజీలాండ్ వాసులు . అక్కడి ఇంజనీర్లు పాల నుండి అనేక ఉత్పత్తులు తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేసారు . కురియన్ న్యూజీ లాండ్ సాంకేతికతను వాడుకో వాలని తలంచి గేదెపాల నుండి పాలపొడి తయారు చేసే ఫార్ములాను కోరగా , వారు ఇది అసాద్యం , కుదరనే కుదరదు అని తిరస్కరించారు. స్వతహాగా కురియన్ కెమికల్ ఇంజినీర్ . దేశీయంగానే సాంకేతికతను అభివృద్ధి చేసి , అందునా గేదె పాల ద్వారాసహకార రంగంలో చేసి పాలపొడి తయారీని విజయవంతంగా పూర్తి చేసాడు . తరువాత అనేక ఇతర ఉత్పత్తులకు శ్రీకారం చుట్టాడు. అమూల్ బ్రాండ్ పేరున గుజరాత్ లో సహకార పరిశ్రమకు తోడ్పాటు నందించి దేశంలోనే ప్రముఖ సంస్థగా , అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దాడు. ఆయన చూపిన బాటనే దేశవ్యాప్తంగా రైతుల చేత సహకార ఉత్పత్తి కేంద్రాలు స్థాపింపబడి, నేడు భారత్ ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్ర స్థానంలో ఉంది.
డాక్టర్ కురియన్ ప్రస్థానం 1949 లో గుజరాత్ లో కైరా జిల్లాలో ఆనంద్ లో పాడిపరిశ్రమ కేంద్రంలో ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరిన పిదప రైతుల పరిస్థితి , వారిని దోచుకునే విధానాలను చూసి చలించి పోయాడు. అప్పట్లో పాల్సన్ అనే విదేశీ ప్రైవేటు డైరీ రైతులను నానా ఇబ్బందులకు గురి చేసేది . సరైన ధర చెల్లించక పోవడం చేత , తరచుగా సమ్మెలు జరిగేవి . కైరా జిల్లా పాల సహ కార సంఘం అనేది స్వాతంత్ర్యం రాక పూర్వమే 1946 లో ఏర్పడింది. దానిపేరే తరువాత ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటే అమూల్ గా మారింది . 1955 లో ఆనంద్ లో తొలి అముల్ సహకార డైరీ ప్లాంట్ ఏర్పడి నది . అప్పటి వరకు పాల సేకరణ మాత్రమే సంస్థ చేసేది . ఆ తరువాత బట్టర్ , నెయ్యి , పాలపొడి తయారీ మొదలు పెట్టింది. అధికారుల ప్రమేయం లేకుండా పాడి రైతులే స్వతంత్ర నిర్ణేతలుగా ఉండే , సహకార డైరీ వ్యవస్థగా ఉండేందుకు విధి విధానాలను కురియన్ ఏర్పరచాడు . అదే దేశ వ్యాప్తంగా క్షీర విప్లవానికి నాంది పలికింది . గేదెల పాల నుండి పాలపొడి తయారు చేయడంతో పాడి పరిశ్రమగా మారింది .
Also Read: CM KCR Sankranti Wishes: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కెసిఆర్
ఇప్పటికి కూడా ప్రపంచంలో ఉండే గేదెలు 57 % , ఆవులు 16 % భారత్ లో ఉన్నాయి . 1950 – 51 లో 1.70 కోట్ల టన్నుల పాలు మన దేశంలో ఉత్పత్తి అయ్యేవి . అవి దేశీయ అవసరాలకు సరిపోక విదేశాల నుండీ 55 వేల టన్నుల ఆవు పాలపొడిని దిగుమతి చేసుకునే వారు. కురియన్ సారధ్యంలో నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డ్ 1965 లో చేపట్టిన ఆపరేషన్ ఫ్లడ్ పధకం ద్వారా సహకార ఉద్యమం దేశమంతా విస్థ రించడంతో భారత్ స్వయం సమృద్ధి సాధించింది . 1998 నాటికి ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి దేశంగా , అత్యధిక పాడి పశువులు ఉన్న దేశంగా గుర్తింపు తెచ్చుకున్నాము. ఇప్పుడు మన దేశంలో 1.85 లక్షల గ్రామాల్లో పాల సహకార సంఘాలు పనిచేస్తున్నవి. ఇందులో ముప్పై వేలకు పైగా సంస్థలను మహిళలు నిర్వ హిస్తున్నారు . పాల ఉత్పత్తి క్రమంలో మహిళల పాత్ర డెబ్భై శాతం మేర ఉంటుంది. మనదేశంలో షుమారు 210 సహకార పాల డైరీలు , తొమ్మిది పెద్ద పాల ఉత్పత్తి దారుల సంస్థలు ఉన్నాయి . 2017 – 18 నాటికి పాల ఉత్పత్తి 17.65 కోట్ల టన్నులకు చేరి 2021 – 22 నాటికి 25 కోట్ల టన్నులకు చేర్చే ప్రయత్నాలను ప్రభుత్వాలు చేస్తూ అందుకు తగ్గ ప్రణాళికలు రూపొం దించాయి. గ్రామాల్లో ఉత్పత్తి అవుతున్న పాలను ఆయా గ్రామస్తులు 45 % వాడు కుంటున్నారు . మిగతా 55 % సహకార డైరీలు , ప్రైవేటు డైరీలు సేకరించి పట్టణాలకు , నగరాలకు సరఫరా చేస్తున్నవి . వినియోగదారులు చెల్లించే ధరలో షుమారు 65 – 70 % పాడిరైతు పొందు తున్నాడు. సహకార డైరీలో సభ్యుడైన పాడిరైతు మరో పదిశాతం అదనంగా పొందు తున్నాడు . 1950 లో ప్రతి రోజుకు ప్రతి మనిషికి 135 గ్రాములు పాలు మాత్రమే అందుబాటులో ఉండగా , సహకార పాడిపరిశ్రమల వల్ల 2018 నాటికి 375 గ్రాములు పాలు అందుబాటులోకి వచ్చాయి .
కానీ ప్రపంచ తలసరి పాల లభ్యత 295 గ్రాములు మాత్రమే . అది మన దేశంలో 130 కోట్ల జనాభా ఉండగా కూడా ఎనబ్బై గ్రాములు అధికంగా ఉండడం చాలా గొప్ప విషయం. ఇది గొప్ప విజయం కూడా. ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల మంది రైతులు పాలను ఉత్పత్తి చేస్తున్నారు . 2018 లో ప్రపంచ వ్యాప్తంగా 84 కోట్ల టన్నులు పాలు ఉత్పత్తి అవ్వగా , మన దేశం వాటా 19 % . తరువాత ఇ.యు , అమెరికా , చైనా , పాక్ , బ్రెజిల్ , రష్యా , న్యూజిలాండ్ లు ఉన్నాయి . అయితే పాల ఉత్పత్తి ఎగుమతుల్లో ఇ . యు , న్యూజిలాండ్ , అమెరికా లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి . చైనా మాత్రం పాలు , పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది . న్యూజిలాండ్ లో మొత్తం ఉత్పత్తి అయ్యే పాలు 2.2 కోట్ల టన్నులు అయితే 1.9 కోట్ల టన్నుల పాలను ఎగుమతి చేస్తుంది . పాల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించగా 15 కోట్ల మంది చిన్న , సన్నకారు పాడి రైతులు ఉన్నారు . అదే విదేశాల్లో ఒక్కో రైతుకు వందల , వేల ఎకరాల భూమి ఉంటుంది. రైతుల సంఖ్య తక్కువే అయినా , దేశీయ అవసరాలకు పోను మిగులు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. న్యూజిలాండ్ లో 12 వేల మంది , ఆస్ట్రేలియా లో 6 వేల మంది రైతులు మాత్రమే పాల ఉత్పత్తి చేస్తున్నా , పాల ఉత్పత్తులను విదేశాలకు ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చేస్తున్నారు. కొన్ని చిన్న దేశాలకు భారత్ ఎగుమతులు చేస్తోంది.