Iran President Death: భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోందని మోడీ భరోసా
ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి మరియు మత నాయకుడు మహ్మద్ అలీ అలె-హషేమ్‌లతో పాటు రైసీ కూడా మరణించారు.
- By Praveen Aluthuru Published Date - 12:25 PM, Mon - 20 May 24

Iran President Death: ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి మరియు మత నాయకుడు మహ్మద్ అలీ అలె-హషేమ్‌లతో పాటు రైసీ కూడా మరణించారు.
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ నిన్న గ్రామీణ ప్రాంతంలో కూలిపోయింది. ఈ రోజు దాని శిధిలాలు వెలుగుచూశాయి. ఈ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ యొక్క విషాద మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. అతని కుటుంబానికి మరియు ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. అలాగే ఈ దుఃఖ సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.
నిన్న ఆదివారం అడవుల్లో రైసీ మరియు అతనితో పాటు ఉన్న ప్రతినిధి బృందంతో కూడిన హెలికాప్టర్ కూలిపోయిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. ఆదివారం వాయువ్య ఇరాన్‌లో కూలిపోయిన హెలికాప్టర్‌లో తొమ్మిది మంది ఉన్నారని తస్నిమ్ న్యూస్ నివేదించింది. అజర్‌బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి అరాస్ నదిపై డ్యామ్ ప్రారంభోత్సవం నుండి రైసీ మరియు అతనితో పాటు ఉన్న ప్రతినిధి బృందం తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కాలిపోయిన మృతదేహాలను గుర్తించడం కూడా కష్టమని ఇరాన్ అధికారులు తెలిపారు. కాగా రైసీ మరియు అతని బృందం మరణం గురించి తెలుసుకున్న తరువాత ఇరాన్ క్యాబినెట్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మోఖ్బర్ అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
Also Read: Lok Sabha Elections 2024: ముంబైలో ఓటేసేందుకు పోటెత్తిన బాలీవుడ్