22 Species In ICU : వేగంగా అంతరించిపోతున్న 22 జంతువులు, పక్షులు, జలచరాలివే
22 Species In ICU : 22 జాతుల జంతువులు, పక్షులు, జలచరాలను వేగంగా అంతరించిపోతున్న జీవ జాతులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
- By Pasha Published Date - 11:47 AM, Fri - 21 July 23

22 Species In ICU : 22 జాతుల జంతువులు, పక్షులు, జలచరాలను వేగంగా అంతరించిపోతున్న జీవ జాతులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీటి పునరుద్ధరణ కార్యక్రమం కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ వెల్లడించింది. వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి అనే కేంద్ర ప్రాయోజిత పథకం కింద 22 జాతుల జంతువులు, పక్షులు, జలచరాల రక్షణకు(22 Species In ICU) చర్యలు చేపట్టామని తెలిపింది. 2022-23లో ఈ జంతువులను రక్షించడానికి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.56.48 కోట్లు కేటాయించామని వివరించింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో(2022-23) కేటాయింపులు అత్యల్పంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం కోసం 2020-21లో రూ.87.64 కోట్లు, 2021-22లో రూ.87.55 కోట్లు కేటాయించారు.అత్యధికంగా ఒడిశాకు రూ.9.67 కోట్లు, మహారాష్ట్రకు రూ. 3.5 కోట్లు, కర్ణాటకకు రూ. 2.91 కోట్లు, లక్షద్వీప్‌కు రూ.2.69 కోట్లు మంజూరు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి పథకంలో భాగంగా రక్షిత ప్రాంతాల (నేషనల్ పార్కులు, అభయారణ్యాలు, సంరక్షణ నిల్వలు, కమ్యూనిటీ రిజర్వ్‌లు) నెట్‌వర్క్‌ను రూపొందించినట్లు పేర్కొంది. ఈ జంతువులు లక్ష్యంగా జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో శిక్షలను కూడా పెంచామని స్పష్టం చేసింది. జాతీయ వన్యప్రాణుల కార్యాచరణ ప్రణాళిక (2017-31) లో భాగంగా 22 జాతుల జంతువులు, పక్షులు, జలచరాల రక్షణకు నడుం బిగించామని చెప్పింది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఏషియాటిక్ సింహం, సముద్ర తాబేలు, దుగోంగ్, కారకల్, డాల్ఫిన్లు గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి. సముద్ర తాబేలు, జెర్డాన్స్ కోర్సర్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, డాల్ఫిన్లు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తాయి.
Also read : Kishan Reddy: నేడు బీజేపీ పార్టీ పగ్గాలు చేపట్టనున్న కిషన్ రెడ్డి
వేగంగా అంతరించిపోతున్న 22 జీవ జాతులు ఇవే..
- మంచు చిరుత
- గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (బట్ట మేక పిట్ట)
- సముద్ర తాబేలు
- డాల్ఫిన్
- ఫ్లోరికన్ పక్షులు
- హంగుల్ (జింక జాతి)
- నీలగిరి తహర్
- డుగోంగ్ (సముద్రపు ఆవు)
- అండమాన్ ఎడిబుల్ నెస్ట్ స్విఫ్ట్‌లెట్ పిట్ట
- గ్రేట్ బఫెలో
- వైల్డ్ బఫెలో
- నికోబార్ మెగాపాడ్ పక్షి
- ఒక కొమ్మున్న ఖడ్గమృగం
- ఏషియాటిక్ సింహం
- స్వామ్ప్ జింకలు
- కలివి కోడి (జెర్డాన్స్ కోర్సర్)
- నదుల్లో నివసించే మంచినీటి తాబేలు “బటగూర్ బాస్కా”
- మేఘ చిరుత (క్లౌడెడ్ చిరుతపులి)
- అరేబియా సముద్రపు హంప్‌బ్యాక్ జాతి తిమింగలం
- రెడ్ పాండా
- కారకల్ జాతి అడవి పిల్లి