India – China Borders: భారత్, చైనా సరిహద్దుల్లో ఫలించిన చర్చలు
భారత్, చైనా సరిహద్దు తూర్పు లడఖ్ సెక్టార్ వద్ద ఉద్రిక్తత తగ్గింది. ఇరు దేశాల సైన్యాలు LAC నుంచి వెనకడుగు వేశాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
- Author : CS Rao
Date : 13-09-2022 - 7:20 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్, చైనా సరిహద్దు తూర్పు లడఖ్ సెక్టార్ వద్ద ఉద్రిక్తత తగ్గింది. ఇరు దేశాల సైన్యాలు LAC నుంచి వెనకడుగు వేశాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తూర్పు లడఖ్ సెక్టార్‌లోని `పెట్రోలింగ్ పాయింట్-15` సమీపంలోని గోగ్రా హైట్స్-హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి వెనక్కు వెళ్లాయి. రెండు వైపులా ఘర్షణ పాయింట్ నుండి దళాలను వెనక్కి వెళ్లే అడాప్టర్ పొజిషన్‌ల ధృవీకరణ కూడా పూర్తి అయిందని అధికారికంగా తెలుస్తోంది.
ఇరు దేశాల మధ్య 16వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు సెప్టెంబర్ 8న ప్రారంభం అయింది. ఎట్టకేలకు చర్చలు ఫలప్రదం కావడంతో ఇరు దేశాల సైన్యాలు ప్రస్తుత స్థానాల నుండి LAC నుంచి ఎవరి దేశం వైపు వాళ్లు తిరిగి వెళ్లిన తరువాత స్థానాలను ధృవీకరించారు.
Also Read: Borra Caves: బొర్రా గుహల అందాలు అదరహో.. ప్రతి ఒక్కరూ చూడదగిన టూరిస్ట్ డెస్టినేషన్!!
LACపై యథాతథ స్థితిని మార్చానికి చైనా సైన్యం మే 2020 దూకుడును ప్రదర్శించింది. దీంతో భారత సైన్యం అప్రమత్తం కావడంతో ఘర్షణ వాతావరణం సరిహద్దు వెంబడి నెలకొంది. ఇరు దేశాలు సామరస్యంగా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పలు సందర్భాల్లో కుదరలేదు. కానీ, తాజాగా సైన్యాలను ఇరు దేశాలు వెనక్కు తీసుకెళ్లడంతో తాత్కాలికంగా ఉద్రికత్త సద్దుమణిగింది. సైన్యం ఉపసంహరణ ప్రక్రియలో ఇరు దేశాల దళాలు వెనక్కు తగ్గినప్పటికీ ఇతర ఆస్తులను ఆక్రమించిన ప్రదేశంలో నిర్మించిన మౌలిక సదుపాయాలను కూల్చివేయడం మిగిలి ఉంది.