Kharge Vs Modi : మోడీ సర్కారుతో రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ముప్పు : ఖర్గే
Kharge Vs Modi : బీజేపీ ప్రభుత్వాల వల్ల దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
- By Pasha Published Date - 04:44 PM, Mon - 13 May 24

Kharge Vs Modi : బీజేపీ ప్రభుత్వాల వల్ల దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోడీ మరోసారి ప్రధానమంత్రి అయితే దేశంలో ఇక ఎన్నికలు జరగవని ఆయన పేర్కొన్నారు. సోమవారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ కామెంట్స్ చేశారు. ‘‘అదానీ, అంబానీల నుంచి రాహుల్ గాంధీ టెంపోల నిండా డబ్బుకట్టలు తెచ్చుకున్నారని ప్రధాని మోడీ గతంలో తప్పుడు ఆరోపణలు చేశారు. విపక్ష నేత కాబట్టే హేమంత్ సోరెన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అత్యుత్సాహంతో అరెస్టు చేసింది. అదానీ, అంబానీలను అదే విధంగా అరెస్టు చేయించే దమ్ము మోడీకి ఉందా ?’’ అని ఖర్గే (Kharge Vs Modi) ప్రశ్నించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే జైళ్లలో మగ్గుతున్న, అక్రమ కేసులను ఎదుర్కొంటున్న విపక్ష నేతలందరికీ విముక్తి లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు తర్వాత తొలిసారిగా ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘ప్రధాని మోడీ దాదాపు 22 మంది బడా పారిశ్రామిక వేత్తలకు చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయించారు. ఈ డబ్బుతో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 24 ఏళ్లపాటు నిధులను కేటాయించవచ్చు. దేశ సంపదను మోడీ ఆవిరి చేశారు. ఆ 22 మందికి దోచిపెట్టారు. మేం అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళ బ్యాంకు ఖాతాలో ఏటా రూ. లక్ష జమచేస్తాం’’ అని ఆయన ప్రకటించారు. ప్రధాని మోడీకి పేదల సమస్యల కంటే..పారిశ్రామికవేత్తల కుటుంబాల్లో జరిగే పెళ్లిళ్లే ప్రయారిటీగా మారాయని విమర్శించారు.
Also Read :Rahul Gandhi Marriage: ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పెళ్లి…?
దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది.పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ ఉండటం.. దీనికి ఆయన సమాధానం దాటవేయడం షరామామూలే. తాజాగా, రాయ్‌బరేలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఓ చిన్నారి ‘మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు’ అని అడిగితే ఆయన నవ్వుతూ బదులిచ్చారు. ‘బహుశా ఇదే సరైన సమయం ఏమో.. త్వరలోనే వివాహం చేసుకుంటాను” అని రాహుల్ అన్నారు.