Char Dham Yatra : చార్ ధామ్ యాత్రలో హెలికాప్టర్లపై నిషేధం
Char Dham Yatra : భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హెలికాప్టర్ సేవల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష అవసరమని భావిస్తున్నారు
- By Sudheer Published Date - 11:00 AM, Sun - 15 June 25
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ (Kedarnath ) సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Accident) తీవ్ర చర్చలకు దారితీసింది. యాత్రికులను తీసుకెళ్లే హెలికాప్టర్ కుప్పకూలడంతో ప్రభుత్వం పై విమర్శలు మొదలయ్యాయి . ఈ ఘటన నేపథ్యంలో చార్ ధామ్ యాత్రలో హెలికాప్టర్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి సూచనలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది.
Air India Plane Crash : విమాన ప్రమాద బాధితులకు అదనంగా మరో రూ.25 లక్షలు
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికుల భద్రతే తమకెక్కువ ప్రాధాన్యతని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హెలికాప్టర్ సేవల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష అవసరమని భావిస్తున్నారు.
ఈ దిశగా టెక్నికల్ ఎక్స్పర్టులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్‌కు సీఎం ధామీ సూచించారు. ఈ కమిటీ హెలికాప్టర్ల యొక్క టెక్నికల్ ఫిట్‌నెస్, వాతావరణ పరిస్థితుల పరిశీలన, పైలట్ల అనుభవం వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. చార్ ధామ్ యాత్రలో భద్రత ప్రమాణాలను మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం.