Gujarat Rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. 20 మంది మృతి
గుజరాత్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
- By Balu J Published Date - 01:08 PM, Mon - 27 November 23

Gujarat Rains : గుజరాత్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు గుజరాత్ రాష్ట్రం అతలాకుతలం అయింది. అకాల వర్షాలతో పాటు పలు చోట్లు పిడుగులు పడటంతో 20 మంది దాకా మృత్యువాత పడ్డారు. దాహోద్, బరూచ్, అమ్రేలీ, బనస్కాంత, మెహసానా, అహ్మదాబాద్, సబర్ కాంత, సూరత్, ఖేదా, సురేంద్రనగర్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నిజానికి గుజరాత్ రాష్ట్రంలో నవంబర్ 26 నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ తో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలోనూ వర్షాలు పడుతున్నాయి. గుజరాత్ లో భారీ వర్షాలు కురవడం వల్ల ఆ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రైతులు కూడా ఈ అకాల వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేవలం 16 గంటల్లో 50 మిమీలకు పైగా వర్షపాతం నమోదైంది. ఈశాన్య అరేబియా సముద్రంపై తుఫాను సర్యులేట్ అవడం వల్ల సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. అకాల వర్షాలకు పలువురు మృతి చెందడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.