Gujarat Election: గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, డిసెంబర్ 1,5 తేదీల్లో ఎన్నికలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు విడతలుగా డిసెంబర్ 1, 5 తేదీల్లో జరుగుతాయని వెల్లడించింది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయని ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఆ రాష్ట్రంలో 4.9 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు.
- By CS Rao Published Date - 01:01 PM, Thu - 3 November 22

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు విడతలుగా డిసెంబర్ 1, 5 తేదీల్లో జరుగుతాయని వెల్లడించింది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయని ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఆ రాష్ట్రంలో 4.9 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో 34,000కు పైగా పోలింగ్ కేంద్రాలు కలిపి 51,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలకు ముందు కేంద్రం 160 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట్రానికి పంపింది.
మొత్తం 182 మంది ఎమ్మెల్యేలు ఉన్న గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 18, 2023తో ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంతగడ్డ అయిన రాష్ట్రంలో బీజేపీ రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉంది.