VS Dubey : ‘సీఎం’నే జైలుకు పంపిన ఓ అధికారి..!
నిజాయితీగా ఉండే ఒక అధికారి తలచుకుంటే అవినీతిపరుడైన ఏ ముఖ్యమంత్రిని అయినా జైలుకు పంపొచ్చని ఉమ్మడి బీహార్ లో జరిగిన దాణా కుంభకోణం కేసు నిదర్శనంగా నిలుస్తోంది.
- By CS Rao Published Date - 03:52 PM, Mon - 21 February 22

నిజాయితీగా ఉండే ఒక అధికారి తలచుకుంటే అవినీతిపరుడైన ఏ ముఖ్యమంత్రిని అయినా జైలుకు పంపొచ్చని ఉమ్మడి బీహార్ లో జరిగిన దాణా కుంభకోణం కేసు నిదర్శనంగా నిలుస్తోంది. 1995 డిసెంబర్లో బీహార్ ఫైనాన్స్ కమీషనర్ ఉన్న దూబే వివిధ శాఖల పనితీరును సమీక్షించాడు. రొటీన్ ఉద్యోగంలో భాగంగా కేటాయింపులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అధిక మొత్తంలో డబ్బు ఉపసంహరించుకున్న విషయాన్ని గమనించాడు. ప్రత్యేకించి పశుసంవర్ధక శాఖ నుంచి భారీగా నిధులు పక్కదోవ పట్టినట్టు గుర్తించాడు. చాలా సంవత్సరాలుగా అధిక ఉపసంహరణలు ఒక ట్రెండ్‌గా ఉన్నాయని దూబే తెలుసుకున్నాడు. 1993-96లో 5,664 పందులు, 40,500 కోళ్లు, 1,577 మేకలు, 995 గొర్రెలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.10.5 కోట్లు మంజూరు చేసింది. అందుకోసం పశుసంవర్ధక శాఖ ఖాతా నుంచి ఏకంగా రూ.255.33 కోట్లను డ్రా చేయడాన్ని దూబే గుర్తించాడు. ఆ మేరకు సంబంధిత విచారణ విభాగాలకు సమాచారాన్ని రాతపూర్వకంగా అందించాడు.
దాణా కుంభకోణం జార్ఖండ్‌లోని రాంచీ, చైబాసా, దుమ్కా, గుమ్లా, జంషెడ్‌పూర్ జిల్లా ట్రెజరీలు , బీహార్‌లోని బంకాలను కేంద్రంగా చేసుకుని కుంభకోణం జరిగింది. సుమారు రూ. 950 కోట్లు కుంభకోణం జరిగిందని దూబే గుర్తించాడు. అక్రమాలకు సంబంధించి ఆయన తయారు చేసిన నివేదికల ఆధారంగా జనవరి 1996లో అప్పటి చైబాసా డిప్యూటీ కమిషనర్ అమిత్ ఖరే తొలుత దాడులు నిర్వహించాడు. ఆ దాడుల్లో కొనుగొన్న వివరాలను పరిశీలించిన పాట్నా హైకోర్టు రెండు నెలల తరువాత కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించింది.మరియు, లాలూ ప్రసాద్ చైబాసా ట్రెజరీ కేసు విచారణ ప్రారంభమైన 11 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ 2013లో లాలూ ప్రసాద్‌ను సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన మొదటి కేసు. దాదాపు రూ.37.7 కోట్ల మోసపూరితంగా నిధులు డ్రా చేసుకున్న కేసులో లాలూ ప్రసాద్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. చైబాసా దాణా కుంభకోణం కేసులో దోషిగా నిలవడంతో పాటు శిక్ష విధించినందున లోక్‌సభకు అనర్హుడయ్యాడు. డిసెంబరు 2017లో డియోఘర్ ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించారు. 89 లక్షలు మోసపూరితంగా విత్‌డ్రా చేసిన దాణా కుంభకోణంలో రెండోసారి దోషిగా తేలడంతో అతనికి మూడున్నరేళ్ల జైలుశిక్ష పడింది. మరో చైబాసా ట్రెజరీ కేసులో జనవరి 2018లో అతడికి మూడో శిక్ష పడింది. ఈ కేసులో అతనికి ఐదేళ్ల జైలుశిక్ష పడింది. 33.7 కోట్ల మోసపూరిత ఉపసంహరణ కేసు అది.
దుమ్కా ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్‌కు నాలుగో శిక్ష పడింది. దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లు మోసపూరితంగా విత్‌డ్రా చేసినందుకు అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా విధించారు. ఈ నెల ప్రారంభంలో లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించిన ఐదవ కేసులో డోరండా ట్రెజరీ (రాంచీ) రూ.139.35 కోట్ల అవినీతికి సంబంధించినది.
మొత్తం రూ. 409.62 కోట్ల స్కాం దూబే బయటపెట్టాడు.
పశుగ్రాసం కుంభకోణం 1990లలో ఉమ్మడి బీహార్‌లో బయటపడింది. ఆనాడు లాలూ ప్రసాద్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక అవకతవకలపై బీహార్ ఆడిటర్ జనరల్ సీరియస్ కామెంట్స్ చేశాడు. పశుగ్రాసం కుంభకోణంలో “పశువులను స్కూటర్లు, పోలీసు వ్యాన్లు, ఆయిల్ ట్యాంకర్లు మరియు ఆటోలలో రవాణా చేశారు”. దాణా కుంభకోణంలో ఇది అత్యంత శక్తివంతమైన చిత్రంగా మారింది. కేంద్ర బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన 53 కేసుల్లో దాదాపు 170 మంది నిందితుల్లో (ప్రస్తుతం దాదాపు 100 మంది) రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు ఒకరు. 2000లో జార్ఖండ్‌గా రూపుదిద్దుకున్న వాటిలోని ఐదు కేసుల్లో లాలూ ప్రసాద్ నిందితుడిగా ఉన్నాడు. బీహార్‌లోని బంకాలో జరిగిన మరో దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ నిందితుడు. ఆ విచారణ ఇంకా కొనసాగుతోంది. జార్ఖండ్‌లోని మొత్తం ఐదు దాణా కుంభకోణం కేసుల్లో అతను దోషిగా నిర్ధారించబడ్డాడు. దాణా కుంభకోణం బీహార్ రాజకీయాలలో కీలక మలుపు. అంతేకాదు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు ఒక అస్త్రంగా మారింది. కానీ, ఆ కుంభకోణాన్ని బయటపెట్టిన అధికారికి మాత్రం ఎలాంటి ప్రోత్సాహంగానీ, గుర్తింపుగానీ లభించలేదు. పైగా 14ఏళ్ల తరువాత కూడా ఇంకా కొన్ని కేసుల్లో విచారణ పూర్తి కాలేదు. తాజాగా మరో ఐదేళ్లు జైలు శిక్ష పడింది. కానీ, ఆధారాలతో బయటపెట్టిన దూబేకు మాత్రం పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది.