Flipkart Big Diwali Sale 2024: ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ దివాళీ సేల్.. స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు
- Author : Kode Mohan Sai
Date : 19-10-2024 - 5:03 IST
Published By : Hashtagu Telugu Desk
Flipkart Big Diwali Sale 2024: ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ తర్వాత, కస్టమర్లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ దివాళీ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 21న ప్రారంభమవుతుందని, అయితే ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’ యూజర్లకు అక్టోబర్ 20 అర్ధరాత్రి నుండే అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.
స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లు అందించనున్నామని, అలాగే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, గృహోపకరణాలు వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
అదిరిపోయే ఆఫర్లు: Flipkart Big Diwali Sale 2024:
19,999 ధర ఉన్న ఒక స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.9,999కే అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. దీపావళి సేల్‌లో కొనుగోలుదారులు రూ.1,500 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,500 అదనపు తగ్గింపు పొందవచ్చని తెలిపారు. మొత్తంగా కస్టమర్లు రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చని చెప్పారు. అలాగే, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఎస్‌బీఐ కార్డ్‌ను ఉపయోగిస్తే, కస్టమర్లు గరిష్ఠంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు, యాక్సిన్ బ్యాంక్ కార్డ్‌ను ఉపయోగించి అన్ని కొనుగోళ్లపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభించనుందని సమాచారం.