West Bengal : చెత్తకుండీలో 17 గర్భ పిండాలు..!!
పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ఉలుబెరియా నగరంలోని మున్సిపాలిటీ చెత్త కుండీలో 17 పిండాలు బయటపడ్డాయి. ఈ వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- By hashtagu Published Date - 09:24 AM, Wed - 17 August 22

పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ఉలుబెరియా నగరంలోని మున్సిపాలిటీ చెత్త కుండీలో 17 పిండాలు బయటపడ్డాయి. ఈ వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ 17 పిండాల్లో పది ఆడపిల్లలు, ఆరుగు మగపిల్లలు ఉన్నట్లు గుర్తించారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం…ఉలుబెరియా పట్టణ ప్రాంతానికి కిలో మీటర్ దూరంలో 30 ప్రైవేట్ నర్సింగ్ హోంలు ఉన్నాయి. ఈ పిండాలను నర్సింగ్ హోంల వైద్య వ్యర్థాలుగా పడేశారా లేదా ఇంకేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ పిండాలను పోస్టు మార్టం కోసం ఉల్బారియా ఆసుపత్రికి తరలించగా…ఇలాంటి ఘటన జూన్ 25న కర్నాటకలోనూ జరిగింది. బెలగావి జిల్లాల్లోని మూడలగి గ్రామ శివారులో ఒక బాక్సులో 7 అబార్షన్ చేసిన పిండాలను గుర్తించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ విచారణకు కూడా ఆదేశించింది.