Udaipur-Jaipur Vande Bharat Express : భిల్వారా సమీపంలో వందే భారత్ ట్రైన్ కు తప్పిన పెను ప్రమాదం
భిల్వారా సమీపంలో ఉదయ్ పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడిచే మార్గంలో ఎవ్వరో రైల్వే ట్రాక్‌పై రాళ్లు , ఇనుప రాడ్స్ పెట్టారు. దీనిని గమనించిన లోకోమోటివ్ పైలట్లు అప్రమత్తం కావడం తో పెను ప్రమాదం తప్పింది.
- Author : Sudheer
Date : 02-10-2023 - 8:13 IST
Published By : Hashtagu Telugu Desk
భిల్వారా సమీపంలో వందే భారత్ ట్రైన్ (Vande Bharat Express) కు తప్పిన పెను ప్రమాదం తప్పింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ట్రైన్లు తరుచు ఏదొక వార్త తో వార్తల్లో నిలుస్తున్నాయి. మొన్నటి వరకు ఈ ట్రైన్ లపై రాళ్లు రువ్విన దుండగలు..ఈసారి ఏకంగా పెను ప్రమాదానికి ప్లాన్ చేసారు. దీనిని పైలట్లు గ్రహించడం తో పెను ప్రమాదం తప్పింది.
భిల్వారా సమీపంలో ఉదయ్ పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Udaipur-Jaipur Vande Bharat Express) నడిచే మార్గంలో ఎవ్వరో రైల్వే ట్రాక్‌పై రాళ్లు , ఇనుప రాడ్స్ పెట్టారు. దీనిని గమనించిన లోకోమోటివ్ పైలట్లు అప్రమత్తం కావడం తో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గుర్తించిన ట్రైన్ ఆపరేటర్లు ఏ మాత్రం ఆలోచన చేయకుండా, వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడం తో.. ట్రైన్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
Attempt to derail Udaipur-Jaipur VandeBharatExpress.
Why so much Hatred for Vande Bharat ?
Who could be planning such sabotage ?
Mohabbat ki Dukaan !! pic.twitter.com/tF4yahMMRd
— Kashmiri Hindu (@BattaKashmiri) October 2, 2023