Impatient Nitish: కేసీఆర్ ను ఆడుకున్న బీహార్ మీడియా, నితీష్ అసహనం
బీహార్ వేదికగా కేసీఆర్, నితీష్ మధ్య మీడియా వేదికగా విచిత్ర సంఘటన జరిగింది. ఇద్దరు సిఎం లు పెట్టిన మీడియా సమావేశంలో కేసీఆర్ కొంత దూకుడు ప్రదర్శించారు.
- Author : CS Rao
Date : 31-08-2022 - 10:14 IST
Published By : Hashtagu Telugu Desk
బీహార్ వేదికగా కేసీఆర్, నితీష్ మధ్య మీడియా వేదికగా విచిత్ర సంఘటన జరిగింది. ఇద్దరు సిఎం లు పెట్టిన మీడియా సమావేశంలో కేసీఆర్ కొంత దూకుడు ప్రదర్శించారు. జాతీయ రాజకీయాలు మాట్లాడేందుకు ఆసక్తి చూపారు. ఆ సమయంలో నితీష్ అసహనం ఫీల్ అవుతూ మీడియా సమావేశాన్ని ముగించారు. లేచి వెళ్ళడానికి సిద్ధమైన నితీష్ ను మళ్ళీ కూర్చోపెట్టడానికి కేసీఆర్ తంటాలు పడ్డారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బీజేపీ వర్గాలు వైరల్ చేస్తున్నాయి.
సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనలో ఓ ఆసక్తికర పరిణామం హైలైట్ గా నిలిచింది. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి కేసీఆర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ రాజకీయాలపై మాట్లాడటంతోపాటు బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పని చేస్తామని చెప్పారు.
ఈ క్రమంలో మీడియా పలు ప్రశ్నలు సంధించింది. కూటమి, పొత్తుల అంశాలను పదే పదే ప్రస్తావించింది. నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థిగా ఉండడానికి ఒప్పుకుంటారా ? లేక ఎవరుంటారని ప్రశ్నించారు. దీంతో వివిధ పార్టీలతో తాము సమవేశాలు జరుపుతామని అప్పుడే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాగా, నితీష్‌కు సంబంధించిన విషయాలను మీడియా ప్రస్తావించింది.
దీంతో నితీష్ కొంత ఇబ్బంది పడ్డారు. వెంటనే లేచి మీడియా సమావేశం ముగిసిందన్నారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కూర్చొనే ఉన్నారు. మీరు కూర్చొండి అంటూ నితీష్‌ను అభ్యర్థించారు. అయినా కొద్దిసేపు అలాగే నిలబడ్డారు. ఇలా రెండు, మూడు సార్లు జరిగింది. చివరకు రాజకీయాలను మాట్లాడను అంటూ సీఎం కేసీఆర్ చెప్పడంతో సీఎం నితీష్ కూర్చొన్నారు.
Can there really be a bigger embarrassment than this? pic.twitter.com/dZRNix0UpF
— S. Sudhir Kumar (@ssudhirkumar) August 31, 2022