Noida: ఇల్లు కోనేముందు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఇవే!
- By Anshu Published Date - 09:11 AM, Fri - 2 September 22

ఇటీవల నోయిడా దేశంలో జంట భవనాలు అయిన ట్విన్స్ టవర్స్ కూల్చివేతను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తికరంగా తిలకించారు. కాగా ఈ ట్విన్స్ టవర్స్ భారీ ఖర్చుతో నిర్మించినప్పటికీ ఈ రెండు బిల్డింగులను కూల్చివేయాల్సిందే అని సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసింది. ఈ బిల్డింగుల కూల్చివేతతో నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్న బలమైన సందేశాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రజల్లోకి తీసుకెళ్లింది. కాగా అందుకే ఎవరైనా కూడా ఇల్లు లేదా ఏదైనా ఆస్తి కొనేముందు అనుమతుల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్నది వీడియో ద్వారా తెలిపారు.
అయితే ట్విన్స్ టవర్స్ ఎందుకు కూల్చేయాల్సి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కాగా నోయిడా లో జంట భవనాల నిర్మాణ ప్రణాళికను సూపర్ టెక్ సంస్థ ఇప్పటికే పలుసార్లు సవరించి కొత్తగా మరిన్ని అంతస్తులను చేరుస్తూ పోయింది. అయితే నోయిడా భవన నిర్మాణ నిబంధనల ప్రకారం భారీ భవంతులను నిర్మించే ముందు వాటి మధ్య నిర్దేశిత దూరాన్ని పాటించడం తప్పనిసరి. ఇది భవంతుల ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల కూల్చివేసిన ఈ జంట భవనాల విషయంలో మాత్రం నిబంధనల్ని ఉల్లంఘించి మరి చాలా దగ్గరగా నిర్మించారు.
అంతే కాకుండా ఈ ట్విన్స్ టవర్స్ విషయంలో ఉత్తర్‌ప్రదేశ్ అపార్ట్‌మెంట్ చట్టాన్ని సైతం ఉల్లంఘించారు. ప్రాజెక్టులోని ఇళ్లను విక్రయించిన తర్వాత దాని నిర్మాణ ప్రణాళికలో ఎలాంటి మార్పులు చేయాలన్నా కొనుగోలుదారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇకపోతే వాస్తవానికి ప్రాజెక్టు తొలి ప్రణాళిక ప్రకారం జంట భవనాలు నిర్మించిన ప్రదేశంలో సూపర్‌టెక్ గ్రీన్ ఏరియాను అభివృద్ధి చేయాలి. దానికి విరుద్ధంగా ఆ స్థలంలో మరో రెండు భారీ భవంతులను నిర్మించాలని నిర్ణయించడంతో స్థానికులు న్యాయపోరాటానికి దిగి మొత్తానికి విజయం సాధించారు.