Next Stop Moon : “చంద్రయాన్-3” నెక్స్ట్ స్టాప్ చంద్రుడి దక్షిణ ధృవమే.. ఫైనల్ డీబూస్టింగ్ సక్సెస్ ఫుల్
Next Stop Moon : మన "చంద్రయాన్-3" ల్యాండర్ ఇక ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంపై దిగడమే తరువాయి !!
- By Pasha Published Date - 09:08 AM, Sun - 20 August 23

Next Stop Moon : మన “చంద్రయాన్-3” ల్యాండర్ ఇక ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంపై దిగడమే తరువాయి !! చంద్రుడి దిశగా ఒంటరిగా జర్నీ చేస్తున్న “చంద్రయాన్-3” ల్యాండర్ మాడ్యుల్ “విక్రమ్”కు చివరి విడత డీబూస్టింగ్ ప్రక్రియను ఆదివారం తెల్లవారుజాముకు ముందే 2 గంటల ప్రాంతంలో నిర్వహించారు. “విక్రమ్” డీబూస్టింగ్ సక్సెస్ ఫుల్ గా జరిగిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. తాజా డీబూస్టింగ్ తో ల్యాండర్ ను 25 కి.మీ x 135 కి.మీ. కక్ష్యకు తగ్గించామని వెల్లడించింది. ఫలితంగా చంద్రుడి ఉపరితలం నుంచి ల్యాండర్ ఎత్తు, వేగం తగ్గాయి. ల్యాండర్ ఎత్తును, వేగాన్ని తగ్గించడానికి దానిలోని ఇంజన్లను మండించారు. ఇంజన్లు వ్యతిరేక దిశలో మండడం వల్ల ల్యాండర్ నెమ్మది అవుతుంది.
Also read : Luna 25: రష్యా మూన్ మిషన్ ఫెయిల్.. ల్యాండర్‌లో సమస్యలు ?
ల్యాండర్ నిర్దేశిత ప్రదేశానికి వచ్చిన తర్వాత, సాఫ్ట్ ల్యాండింగ్ దశ ప్రారంభం అవుతుంది. ఇదే చాలా కీలకమైన అంశం. ఇస్రోకు ఇది అత్యంత కష్టతరమైన దశ ఇది. గత చంద్రయాన్ 2 ప్రయోగంలో(Next Stop Moon) విఫలం జరిగింది ఇక్కడే. ఆగస్టు 23న సాయంత్రం దాదాపు 5 గంటల 45 నిమిషాల ప్రాంతంలో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ లోని ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ “విక్రమ్” గురువారం (ఆగస్టు 17న) విడిపోయింది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోయేటప్పుడు “థ్యాంక్స్ ఫర్ ద రైడ్, మేట్” అని ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యుల్ ఇస్రోకు మెసేజ్ పంపింది. “విక్రమ్” ఆ రోజు నుంచి తనంత తానుగా చంద్రుని చుట్టూ తిరుగుతూ తాజాగా మరింత దిగువ కక్ష్యలోకి దిగింది.