June 25 as ‘Samvidhaan Hatya Diwas’ : జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యాదినం’గా కేంద్రం ప్రకటన
జూన్ 25, 1975న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించటం ద్వారా నియంతృత్వ వైఖరిని చాటుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యం ఆత్మను ఉరితీశారని ఆరోపించారు
- By Sudheer Published Date - 05:35 PM, Fri - 12 July 24

జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యాదినం’ (Samvidhaan Hatya Diwas)గా కేంద్ర ప్రభుత్వం (Centre declare) ప్రకటించింది. ఈమేరకు హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో ఇబ్బందులు పడ్డ లక్షలాది భారత ప్రజలను స్మరించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జూన్ 25, 1975న (1975 Emergency) అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ (Prime Minister Indira Gandhi) దేశంలో అత్యవసర పరిస్థితి విధించటం ద్వారా నియంతృత్వ వైఖరిని చాటుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యం ఆత్మను ఉరితీశారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని, మీడియా నోరు మూశారని విమర్శించారు. అందువల్ల ప్రతి ఏడాది జూన్ 25న సంవిధాన్ హత్యా దినం జరపాలని మోడీ సర్కార్ నిర్ణయించినట్లు అమిత్ షా తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
రీసెంట్ గా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ‘ సంవిధాన్ బచావో’ అంటూ బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తుంది. 18వ లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఇండియా కూటమి నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగాన్ని చేతబూని ప్రమాణస్వీకారం చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నుంచి తన చేతిలో రాజ్యాంగ ప్రతిని వెంట పెట్టుకుంటున్నారు. అయితే, దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ నేత, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించిన విషయాన్ని బీజేపీ హైలెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జూన్ 25ని రాజ్యాంగాన్ని హత్య చేసిన దినంగా ప్రకటించింది.
Read Also : YS Sharmila : బీజేపీ తొత్తు పార్టీ.. తోక పార్టీ వైసీపీ – వైఎస్ షర్మిల