HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Central Government Jobs Thousands Of Stenographer Posts Are Filled

2006 Jobs : టైపింగ్ వచ్చా.. 2006 కేంద్ర ప్రభుత్వ జాబ్స్‌ మీకోసమే!

స్టెనోగ్రఫీ తెలిసి ఉండి..  ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్. కేంద్రప్రభుత్వ ఉద్యోగం(2006 Jobs) పొందే గొప్ప అవకాశం.

  • By Pasha Published Date - 11:20 AM, Wed - 31 July 24
  • daily-hunt
2006 Stenographer Posts

2006 Jobs : స్టెనోగ్రఫీ తెలిసి ఉండి..  ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్. కేంద్రప్రభుత్వ ఉద్యోగం(2006 Jobs) పొందే గొప్ప అవకాశం. వివిద కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2006 స్టెనోగ్రాఫ‌ర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) నోటిఫికేషన్  విడుద‌ల చేసింది. స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. అయితే 02.08.1994  నుంచి 01.08.2006 మధ్య జన్మించిన వారే అర్హులు. స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-డి) పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. అయితే 01.08.2024  నుంచి 02.08.1997 మధ్య జన్మించి వారే అర్హులు.

We’re now on WhatsApp. Click to Join

  • ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీల వారీగా 10-13-15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్, డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, డిఫెన్స్ (డిసెబుల్డ్) పర్సనల్ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 8 సంవత్సరాల దాకా వయోపరిమితిలో సడలింపులు లభిస్తాయి.
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 ఏళ్ల వరకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 45 ఏళ్ల వరకు వయోపరిమితిలో  సడలింపు ఉంటుంది.
  • వితంతు-విడాకులు-ఒంటరి మహిళలకు 35 ఏళ్ల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 40 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు దక్కుతుంది.
  • అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు సమర్పించాలి.  దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
  • దరఖాస్తుల సమర్పణకు లాస్ట్ డేట్ ఆగస్టు 17. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ ఆగస్టు 18. దరఖాస్తులలో తప్పుల సవరణకు ఆగస్టు 27 నుంచి 28వరకు అవకాశం కల్పించారు.
  • అప్లై చేసే క్రమంలో ఏమైనా సందేహాలు వస్తే టోల్‌ఫ్రీ నంబరు 1800 309 3063కు కాల్ చేయొచ్చు.

Also Read :Comet Of The Century: భూమికి ద‌గ్గ‌ర‌గా తోక‌ చుక్క‌.. ఎప్పుడంటే..?

  • రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియల ద్వారా ఈ జాబ్స్‌ను భర్తీ చేస్తారు.
  • ఈ ఏడాది అక్టోబరు – నవంబరులో రాత పరీక్ష(Stenographer Posts) ఉంటుంది.
  • రాత పరీక్ష ఆన్‌లైన్‌లో రెండు గంటల పాటు ఉంటుంది.  200 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది.   200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు.
  • ప్రత్యేక అవసరాలు కలిగిన అభ్యర్థులకు 40 నిమిషాలు ఎక్కువ టైం ఇస్తారు.
  • హిందీ, ఇంగ్లిష్ మీడియంలలో ప్రశ్నలు ఉంటాయి.
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి  50 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి  50 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ విభాగం నుంచి  100 ప్రశ్నలు అడుగుతారు.
  • పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25  చొప్పున మార్కులు కట్ చేస్తారు.
  • పరీక్షలో కనీస అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 30 శాతంగా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25 శాతంగా, ఇతరులకు 20 శాతంగా నిర్ణయించారు.
  • మన తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, క‌ర్నూలు, రాజ‌మ‌హేంద్రవ‌రం, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్, వ‌రంగ‌ల్‌లలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

Also Read :Alzheimers: అల్జీమర్స్ సమస్యకు చెక్ పెట్టొచ్చు ఇలా..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Central Government Jobs
  • jobs
  • SSC
  • Staff Selection Commission
  • Stenographer Posts

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd