CBSE Result: మే మొదటివారంలో CBSE ఎగ్జాం రిజల్ట్స్ .. ఇలా చెక్ చేయండి ..!
సెంట్రల్ బోర్డ్ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి ఎగ్జాం రిజల్ట్స్ (CBSE Result)ను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. అయితే ఫలితాలు విడుదల చేసే తేదీపై బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.
- By Hashtag U Published Date - 06:29 AM, Wed - 26 April 23

సెంట్రల్ బోర్డ్ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి ఎగ్జాం రిజల్ట్స్ (CBSE Result)ను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. అయితే ఫలితాలు విడుదల చేసే తేదీపై బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. మీడియా కథనాల ప్రకారం.. CBSE బోర్డు ఫలితాలను మే మొదటి వారంలో ప్రకటించే చాన్స్ ఉందని భావిస్తున్నారు. CBSE రిజల్ట్స్ కోసం బోర్డ్అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ను కూడా తనిఖీ చేయొచ్చు. గత సంవత్సరం CBSE బోర్డు రెండు టర్మ్‌లలో పరీక్షలను నిర్వహించింది. అయితే అప్పట్లో రెండు టర్మ్‌లకు వేర్వేరుగా రెండుసార్లు ఫలితాలను ప్రకటించారు. అయితే ఈ ఏడాది ఒకేసారి పరీక్షలు నిర్వహించారు. ఈసారి మాత్రం గతేడాది కంటే ముందుగానే 10వ తరగతి, 12వ తరగతి ఎగ్జాం రిజల్ట్స్ ను ప్రకటించాలని భావిస్తున్నారు.
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు , తల్లిదండ్రులు ఫలితాలను cbse.gov.in, cbseresuts.nic.in అధికారిక వెబ్‌సైట్
లలో చూసుకోవచ్చు. ఈ ఫలితాలు డిజిలాకర్, కొన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక యాప్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. CBSE బోర్డు 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఈసారి ఫిబ్రవరి 14న స్టార్ట్ అయ్యాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 21 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 5 వరకు జరిగాయి. 10వ తరగతి ఎగ్జామ్స్ ను 21,86,940 మంది, 12వ తరగతి ఎగ్జామ్స్ ను 16,96,770 మంది విద్యార్థులు రాశారు.
Also Read: Zodiac Signs: 5 రాశుల వాళ్ళూ.. అక్టోబర్ 17 వరకు బీ అలర్ట్
CBSE ఫలితాలు ఎలా చెక్ చేయాలి..?
* అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
* 10వ తరగతి, 12వ తరగతి CBSE ఫలితాలు 2023 అనే లింక్‌పై క్లిక్ చేయండి.
* క్లిక్ చేయగానే మీరు నేరుగా లాగిన్ పేజీకి వెళ్తారు.
* మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
* CBSE ఫలితం 2023 స్క్రీన్ పై మీకు కనిపిస్తుంది.
* దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని సేవ్ చేయండి.
CBSE ఫలితాలకు ప్రత్యామ్నాయ వెబ్‌సైట్‌లు ఏవి..?
* cbseresults.nic.in
* cbse.nic.in
* cbse.gov.in
* digilocker.gov.in
* results.gov.in