Kolkata Trainee Doctor : 43 మంది డాక్టర్లపై పశ్చిమబెంగాల్ సర్కార్ బదిలీ వేటు
బదిలీ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే వైద్యవర్గాలు, విపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి
- By Sudheer Published Date - 08:24 PM, Sat - 17 August 24

కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ (Kolkata Trainee Doctor) హత్యాచార ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన లో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సుమారు 43 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్ల బదిలీ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే వైద్యవర్గాలు, విపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. మెడికల్ స్టూడెంట్లు, జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసన ఉద్యమంలో పాల్గొన్నందుకు శిక్షగానే 43 మంది వైద్యులను బదిలీ చేశారని, ఈ చర్యను తాము ఖండిస్తున్నట్లు యూనైటెడ్ డాక్టర్స్ అసోసియేషన్ (యూడీఎఫ్ఏ) ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join.
బాధితురాలికి న్యాయం జరగాలని దేశంలోని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తుంటే, న్యాయం జరిపించడానికి బదులుగా తృణమూల్ ప్రభుత్వం రేపిస్టులను కాపాడుతోందని తప్పుపుట్టారు. టీఎంసీ అంటే ‘తాలిబాన్ ముఝే చాహియే’ అని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అభివర్ణించారు. మరోపక్క సోషల్ మీడియా ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టంకు సంబంధించిన రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయని నెటిజన్లు చేస్తున్న ప్రచారం ఫై కోల్‌కతా పోలీసులు ఖండించారు. ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిందని.. ఆమె ఎముకలు విరిగిపోయాయని.. ఇక మరీ ముఖ్యంగా ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉందని రకరకాల ఊహాగానాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాలు వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రచారం ఫై కోల్‌కతా పోలీసులు స్పందించారు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. అనవసర వార్తలు విని.. జనం ఆగ్రహానికి గురికావద్దని సూచించారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈనెల 8 వ తేదీన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ రాత్రి విధుల్లో ఉన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం సెమినార్ హాల్‌లో ఆమె అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు నిందితుడైన సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
Read Also : Runamafi : ఏ సెంటర్ కైనా వస్తా..రుణమాఫీ జరిగిందంటే దేనికైనా సిద్ధం – హరీష్ రావు