Bank Customers Alert: ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇలా..
ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇక బ్యాంకు బ్యాలెన్స్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
- By Hashtag U Published Date - 09:12 AM, Sun - 4 September 22

ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇక బ్యాంకు బ్యాలెన్స్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ నంబర్ లింక్ అయి ఉంటే చాలు.. బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడం వెరీ ఈజీ.
ఏటీఎం సెంటర్ కు వెళ్లకుండా.. ఏటీఎం కార్డుతో పని లేకుండా.. బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండానే బ్యాంక్ అకౌంట్ లోని బ్యాలెన్స్ ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు.
ఆధార్ కార్డు నంబర్ తో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకునే వెసులుబాటు ఉండటం.. స్మార్ట్ ఫోన్ వినియోగం గురించి పెద్దగా అవగాహన లేని వారికి గొప్ప సౌకర్యం.
ఆధార్ తో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇలా..
* తొలుత మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి *99*99*1# కు కాల్ చేయండి.
* ఆ తర్వాత వచ్చే ఆప్షన్ ను అనుసరించి.. 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ ను అందులో ఎంటర్ చేయండి.
* ఆధార్ నంబర్ ను రెండోసారి కూడా ఎంటర్ చేసి వేరిఫై చేయాల్సి ఉంటుంది.
* ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ కు ఆధార్ అథారిటీ UIDAI నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అందులో మీ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు ఉంటాయి.
* ఈ సర్వీస్ ద్వారా మీ అకౌంట్ నుంచి ఇతర బ్యాంక్ అకౌంట్లకు డబ్బులను కూడా పంపించవచ్చు.
* పాన్ కార్డు కోసం అప్లై చేసేందుకు, ప్రభుత్వ సబ్సిడీల కోసం దరఖాస్తులను సమర్పించేందుకు కూడా ఈ సర్వీస్ వాడుకోవచ్చు.
* ఈ సర్వీస్ ద్వారా ఆధార్ కార్డుకు మీ ఫోన్ నంబర్ ను అటాచ్ చేయొచ్చు.ఆధార్ కార్డ్ లోని మీ అడ్రెస్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళకుండానే ఈ సేవలను పొందొచ్చు.
* ప్రజలకు ఇంటి చెంతనే ఆధార్ కార్డుల సేవలను అందించేందుకు తపాలా శాఖ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా 48000 మంది పోస్ట్ మెన్స్ కు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పూర్తి కాగానే వీళ్ళు ఇంటికే వచ్చి మీకు ఆధార్ సేవలను అందిస్తారు.
Related News

Aadhar Card: ఆధార్ కార్డు విషయంలో UIDAI కీలక నిర్ణయం.. ఇక నుంచి అది తప్పనిసరి
ఆధార్ కార్డు అనేది ప్రతిఒక్కరికీ తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఆధార్ కార్డు ఏ పని అవ్వదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కావాలన్నా, సిమ్ కార్డు కావాలన్నా, ప్రభుత్వ పథకాలు కావాలన్నా.