HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Amit Shah Comments Manipur Women Video

Manipur : మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఫై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

ఉద్దేశపూర్వకంగానే మహిళల నగ్న ఊరేగింపు వీడియోను విడుదల చేశారని.. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని

  • Author : Sudheer Date : 28-07-2023 - 8:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah comments manipur women video
Amit Shah comments manipur women video

గత మూడు నెలలుగా మణిపూర్ (Manipur) వణికిపోతోంది. కుకీలు, మెయిటీలకు మధ్య భయంకర పోరు నడుస్తుంది. నడి రోడ్ ఫై ఇద్దరు మహిళలను వివస్త్రల్ని చేసి రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తూ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల గ్యాంగ్ రేప్ (Gang Rap) ఘటన ఫై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇదే తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు సైతం మణిపూర్ ఘటన లపై తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకుని విచారణకు ఆదేశించింది. బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది.

కాగా ఈ ఘటన కు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మహిళల నగ్న ఊరేగింపు వీడియోను విడుదల చేశారని.. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఓ మైనర్ సహా ఆరుగురిని అరెస్ట్ చేసారని , వీడియో తీసిన వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేశామని.. వీడియో తీసిన మొబైల్‌ ఫోన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఈ వీడియో విడుదల చేశారని.. దీని వెనక కుట్ర ఉందని అమిత్ షా ఆరోపించారు.

1990 నుంచి మణిపూర్‌లో కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని ..కేంద్రంలో, మణిపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. చాలా ఘటనలు జరిగాయని అమిత్ షా గుర్తుచేశారు. 1993 లో నాగా – కుకీలకు.. 1993 మే నెలలో మెయితీ – పంగల్‌ తెగల మధ్య, 1995 లో కుకీలు – తమిళుల మధ్య, 1997 నుంచి 1998 మధ్య కుకీ – మెయితీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. మణిపూర్‌ అల్లర్లకు సంబంధించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఇప్పటికే 6 కేసులను ఇప్పటికే సీబీఐకి పంపినట్లు వెల్లడించారు. మరో 3 కేసులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతోందని హామీ ఇస్తున్నామని తెలిపారు.

Read Also : WhatsApp: వాట్సప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై షార్ట్ వీడియో మెసేజెస్?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • manipur
  • Manipur video
  • Parliament Session

Related News

West Bengal BJP CM Suvendu Adhikari

Suvendu Adhikari: నేడే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక మలుపు. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఏలిన బెంగాల్ గడ్డపై మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సువేందు అధికారి బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద

  • Suvendu Adhikari as Bengal CM

    Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి

  • Congress must introspect, says Shashi Tharoor

    Shashi Tharoor: మోదీ, షా వ్యూహం భేష్.. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలన్న శశి థరూర్

Latest News

  • Liquor Shops: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం

  • Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd