Travel : అమెరికా వెళ్లొద్దామా.. కోవాగ్జిన్ తీసుకున్నా ఓకే!
కరోనా రాకతో ఒక్కసారిగా పరిస్థితులు చాలావరకు మారాయి. కేసులు భారీగా తగ్గుతున్నా.. జనాలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం మరిచిపోవడం లేదు.
- By Balu J Published Date - 12:53 PM, Sat - 6 November 21
కరోనా రాకతో ఒక్కసారిగా పరిస్థితులు చాలావరకు మారాయి. కేసులు భారీగా తగ్గుతున్నా.. జనాలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం మరిచిపోవడం లేదు. కొవిడ్ బారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. మొదటి డోస్ కంప్లీట్ అయ్యినవాళ్లు రెండు డోసు కోసం.. ఇంకా ఫస్ట్ డోసు కూడా తీసుకోనివాళ్లు ప్రభుత్వాల ఆదేశాల మేరకు టీకా వేయించుకుంటున్నారు. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఒక్కో దేశం ఒక్కో వ్యవహరిస్తోంది. కొన్ని దేశాలు స్పుత్నిక్ లాంటి టీకా తీసుకోవడానికి ఆసక్తి చూపితే, మరికొన్ని కోవాగ్జిన్, కోవిష్టీల్డ్ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి.
అంతేకాదు.. ఆయా దేశాల ప్రభుత్వాలు ఏ టీకా ను గుర్తింపును ఇస్తాయో.. విదేశీయులు కూడా అదే టీకాను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే చాలా దేశాలు విదేశీ ప్రయాణాలను చాలా కఠినతరం చేశాయి కూడా. తమ దేశం గుర్తింపు ఇచ్చిన టీకానే తీసుకోవాలని కఠిన రూల్స్ అమలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ‘కొవాగ్జిన్’కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ టీకా తీసుకున్న వాళ్లను దేశంలోకి అనుమతిస్తున్నట్టు తెలిపింది. టీకా తీసుకున్న విదేశీయుల కోసం తాజాగా కొత్త ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసిన అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కొవాగ్జిన్‌ను జాబితాలో చేర్చింది. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో భారత్, అమెరికా దేశాల మధ్య మరిన్ని రాకపోకలు జరగనున్నాయి. వాణిజ్యం సంబంధాలు కూడా మెరుగుపడనున్నాయి.
Also Read : యూరప్ కోవిడ్ మరణాలపై WHO ఆందోళన.. ఫిబ్రవరి నాటికి?
Related News
Elon Musk: భారత పర్యటన రద్దు చేసుకుని చైనా వెళ్లిపోయిన ఎలాన్ మస్క్
ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ పర్యటన పబ్లిక్ గా జరగలేదు. ఓ ప్రైవేట్ జెట్ ద్వారా ఎలాన్ మస్క్ చైనా వెళ్లినట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం మస్క్ చైనా పర్యటనలో భాగంగా చైనా అధికారులతో రహస్య భేటీలు నిర్వహించారు.