HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Air India Ahmedabad Crash Chairman Response

TATA : అహ్మదాబాద్ విమానం ప్రమాదంపై టాటా చైర్మన్ కీలక వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన దురదృష్టకర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో, టాటా సన్స్ , ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • By Kavya Krishna Published Date - 02:26 PM, Thu - 19 June 25
  • daily-hunt
N Chandrasekaran
N Chandrasekaran

TATA : అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన దురదృష్టకర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో, టాటా సన్స్ , ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు.

“ఇది చాలా బాధాకరమైన ఘటన. ఎయిరిండియా వంటి సంస్థలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు అండగా నిలబడతామని హామీ ఇస్తున్నాం. వారికి అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది” అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.‌

గత గురువారం లండన్‌కు బయల్దేరిన డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ171 టేకాఫ్ అయిన కొద్ది సమయానికే ఒక్కసారిగా అదుపు తప్పి అహ్మదాబాద్‌లోని ఒక భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదం మానవ తప్పిదం, సాంకేతిక లోపం లేదా మరేదైనా కారణంతో జరిగిందా అనే విషయంపై డీజీసీఏ ప్రత్యేక విచారణ చేపట్టింది.

ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని చంద్రశేఖరన్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తవడానికి కనీసం ఒక నెల సమయం పట్టవచ్చని అంచనా వేసారు. విమానంలో ఏవైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా సమీక్షిస్తున్నామని తెలిపారు. అంతేగాక, ప్రమాదానికి గురైన విమానం గతంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని తెలిపారు. “కుడివైపు ఇంజిన్‌ను మార్చి మూడు నెలలే అయింది. ఎడమవైపు ఇంజిన్‌కు గత నిర్వహణ 2023 జూన్‌లో జరిగిందని, తదుపరి మేంటెనెన్స్ 2025 డిసెంబర్లో జరగాల్సి ఉంది” అని ఆయన వివరించారు.

విమానాన్ని నడిపిన పైలెట్లు అత్యంత అనుభవజ్ఞులని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. కెప్టెన్ సభర్వాల్‌కు 11,500 గంటల పైగా, కోపైలట్ కుందర్‌కు 3,400 గంటల పైగా విమానయాన అనుభవం ఉందన్నారు. “ప్రస్తుతం ఈ ఘటనకు గల కారణం ఏంటన్న దానిపై స్పష్టత లేదు. బ్లాక్ బాక్స్‌ డేటా, ఇతర రికార్డర్ల విశ్లేషణ తర్వాతే నిజమైన కారణాలు వెలుగులోకి వస్తాయి. అప్పటివరకు ఊహాగానాలతో ముందుకు పోకూడదు” అని చంద్రశేఖరన్ అన్నారు.

Auto Tips : మీ పాత కారును అమ్మే బదులు, దానిని స్క్రాప్‌కు ఇచ్చి లాభం పొందండి.. ఎలా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ahmedabad Plane Accident
  • AI171 crash
  • Air India crash
  • Air India official response
  • Black box analysis
  • Civil aviation safety
  • DGCA Investigation
  • Dreamliner crash India
  • N Chandrasekaran statement
  • Tata Sons Air India

Related News

    Latest News

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

    • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

    • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

    • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd