Aditya L1 Mission LIVE : మరికాసేపట్లో నింగిలోకి ఆదిత్య-ఎల్1
సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలే లక్ష్యంగా ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.
- By Sudheer Published Date - 11:00 AM, Sat - 2 September 23

Aditya L1 Mission : మొట్టమొదటిసారిగా జాబిల్లి ఫై అడుగుపెట్టి రికార్డు సృష్టించిన ఇస్రో (ISRO) ఇప్పుడు సూర్యుడి ఫై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలే లక్ష్యంగా ఆదిత్య-ఎల్1 (Aditya L1 ) ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.
శ్రీహరికోటలో ఉన్న సతీణ్ స్పేస్ సెంటర్‌లో శుక్రవారం 12:10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా..మరికాసేపట్లో ఆదిత్య-ఎల్1 (Aditya-L1 Mission)నింగిలోకి దూసుకెళ్లనుంది. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని సూర్యుడి హాలో కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని చేర్చనున్నారు. గ్రహణాల వంటి అడ్డంకులతో సంబంధం లేకుండా సూర్యుడ్ని నిరంతరం అధ్యయనం చేసేందుకు లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1) (Lagrangian point (L1) ) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహం చేరి.. ఐదేళ్ల పాటు అక్కడ సమాచారాన్ని సేకరిస్తుంది.
ఈ ప్రయోగం కోసం ఇస్రో ఏడు పేలోడ్స్ సిద్ధం :
ఈ ప్రయోగం కోసం ఇస్రో ఏడు పేలోడ్స్ ను తీసుకెళ్లనుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా(సూర్యుడి బయటి పొర) పై అధ్యయనం చేయడంలో ఉపయోగపడనున్నాయి. పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ సోలార్ మిషన్ కోసం పేలోడ్స్ ను అభివృద్ధి చేశాయి. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించనుంది ఇస్రో. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది. ఆదిత్య-ఎల్1లోని నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని పరిశీలించనున్నాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు ఎల్ – 1 పాయింట్ వద్ద కణాలు, క్షేత్రాలకు సంబంధించి పరిశీలనలు చేయనున్నాయి.
మన సౌర వ్యవస్థలో భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుడే. దూరంలో ఉన్న వాటికంటే.. దగ్గర్లో ఉన్న వాటిని అధ్యయనం చేయడం సులువు. అలాగే వాటిలో జరిగే మార్పులను, వాతావరణాన్ని నేరుగా వీక్షించవచ్చు, అనుభవించవచ్చు. ఇతర నక్షత్రాల కంటే సూర్యుడిపై చాలా మెరుగ్గా ప్రయోగాలు సాగించవచ్చు. నక్షత్రమైన సూర్యుడిని అధ్యయనం చేస్తే.. ఇతర గెలాక్సీల్లో ఉన్న నక్షత్రాలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అనేది ఇస్రో చెబుతున్న మాట.
Also Read: Modi vs INDIA : గోదీ మీడియా Vs ఇండియా
సూర్యుడి ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి..
సూర్యుని నుంచి వచ్చే వేడి, అతినీలలోహిత కిరణాలు, సౌర శక్తి, కరోనల్ మాస్ ఎజెక్షన్, సౌర తుపానులు వంటివన్నీ భూమిపై ప్రభావం చూపిస్తాయి. సూర్యునిలో వచ్చే ఏ చిన్న మార్పు అయినా భూమిపై ప్రభావం చూపిస్తుంది. అందుకే సూర్యుడిని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతుండటం చాలా అవసరం అని ఇస్రో చెపుతుంది. ఇంటర్నెట్ ను అందించే ఉపగ్రహాలు, వాతావరణాన్ని తెలియజేసే శాటిలైట్లు, జీపీఎస్ సేవలను అందంచే ఉపగ్రహాలన్నీ సూర్యుడిలో వచ్చే మార్పులకు ప్రభావితం అవుతాయి. అలాగే సూర్యుడి నుంచి వెలువడే వివిధ ఉష్ణ, అయస్కాంత దృగ్విషయాలు చాలా ప్రమాదకరమైనవి. ఈ కారణాల వల్ల సూర్యునిపై ఎప్పటికీ ఓ కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం. ఆదిత్య- ఎల్1 కూడా అలాంటి నిఘా పనులు చేయనుందని ఇస్రో తెలిపింది. భూమి నుంచి లాంగ్రేజియన్ పాయింట్ కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుందిి. లాంగ్రేజియన్ 1 పాయింట్ లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టడం వల్ల గ్రహణాల వంటివి పరిశోధనలకు అడ్డంకిగా మారవు.
ఆదిత్య- ఎల్1 ప్రయోగం ఐడియా ఎప్పుడు వచ్చిదంటే…ఎంత ఖర్చు (Aditya L 1 Budget) అవుతుంది.
ఆదిత్య- ఎల్1 ప్రయోగం అనేది ఇప్పటికి ఇప్పుడు వచ్చింది కాదు. అడ్వైజరీ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ 2008 జనవరిలో ఆదిత్య ఆలోచన చేసింది. మొదట్లో దీన్ని సౌర కరోనాను అధ్యయనం చేయడానికి కరోనాగ్రాఫ్‌తో భూ నిమ్న కక్ష్యలో ఉండి పనిచేసే చిన్న 400 kg (880 lb) ఉపగ్రహంగా ఆలోచన చేసారు. 2016–2017 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 కోట్ల ప్రయోగాత్మక బడ్జెట్‌ను కేటాయించారు. అప్పటినుండి ఈ మిషన్ పరిధిని విస్తరించారు. ఇప్పుడు దీనిని లాగ్రాంజ్ పాయింట్ L1 వద్ద ఉంచి, ఒక సమగ్ర సౌర అంతరిక్ష పర్యావరణ అబ్జర్వేటరీగా ప్లాన్ చేసారు. అంచేత ఈ మిషన్‌కు “ఆదిత్య-L1” అని పేరు పెట్టారు. 2023 జూలై నాటికి, మిషన్ ప్రయోగ ఖర్చులు కాకుండా రూ. 378.53 కోట్లను కేటాయించారు.
Also Read: ISRO Scientist : ఇస్రో శాస్త్రవేత్త కావడం ఇలా.. ఏం చదవాలి ? ఎక్కడ చదవాలి ?
ఆదిత్య ఎల్1 లో అతి ముఖ్యమైన పేలోడ్ ఇదే..
ఆదిత్య ఎల్1 ప్రైమరీ పేలోడ్.. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (The Visible Emission Line Coronagraph (VELC)). ఈ మిషన్‌లో అతి ముఖ్యమైన పేలోడ్ ఇదే. సూర్యుడి కొరొనాను అధ్యయనం చేయడంలో దీనిదే కీ రోల్. సూర్యుడి గురించి సమగ్రంగా విశ్లేషించడానికి ఈ పేలోడ్‌ను పంపించనుంది ఇస్రో. ఎల్1 పాయింట్‌కు చేరిన తరువాత గ్రౌండ్ స్టేషన్‌కు రోజుకు 1,440 ఫొటోలను పంపించే సామర్థ్యం (Largest Aditya-L1 sun mission payload to send 1,440 images per day) దీనికి ఉంది.
సూర్యుడి ఫై పరిశోధనలు చేస్తున్న మొదటి స్పేస్‌క్రాఫ్ట్ ఇదే
సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్ (first space based Indian mission) ఇదే కావడం విశేషం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. తక్కువ ఇంధనాన్ని వినియోగించుకొని నిర్దేశిత కక్ష్యలో ఎక్కువ కాలం కొనసాగేలా ప్రయోగం చేపడుతున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. తద్వారా సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇంకెందుకు ఆలస్యం ఆదిత్య-ఎల్1 నింగిలోకి ఎలా వెళ్తుందో మీరే ఈ కింది వీడియో లో చూడండి.
Tags
- Aditya L 1 Budget
- Aditya L1 Mission
- Aditya L1 Mission LIVE updates
- Aditya-L1
- Countdown begins for Isro Aditya-L1
- first space based Indian mission
- Lagrangian point (L1)
- The Visible Emission Line Coronagraph
- VELC
- What is L1 in Aditya Mission?
- What is the cost of Aditya-L1 in Indian rupees?
- When Aditya-L1 will be launched?
- Where Aditya-L1 will be launched?