Police in shock: అమ్మాయిని కాపాడడానికి వెళ్లి అవాక్కైనా పోలీసులు!
ఉలుకు పలుకు లేకుండా కూర్చొని ఉన్న అమ్మాయిని కాపాడేందుకు వెళ్లిన పోలీసులకు షాక్ తగిలింది
- By Anshu Published Date - 08:37 PM, Wed - 14 December 22

ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి రోడ్డు పక్కన ఒక స్టాల్ లో రెండు గంటల పైన అపస్మారక స్థితిలో ఉంది. అటుగా వెళుతున్న ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగలగొట్టి మరి అమ్మాయికి సహాయం చేయడానికి లోపలికి వెళ్లారు. ఇంత రవస జరుగుతున్న ఆ అమ్మాయి మాత్రం టేబుల్ మీద ఉలుకు పలుకు లేకుండా ముందుకు వంగి పడిపోయి ఉంది.
లోపలికి ఎంటర్ అయ్యి అమ్మాయికి సహాయం చేయడానికి దగ్గరకు వెళ్ళిన పోలీసులు అమ్మాయిని చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే అంత సేపు ఆ టేబుల్ దగ్గర కూర్చుంది అమ్మాయి కాదు ఒక ఆర్టిస్ట్ చేసిన శిల్పం. అచ్చం అమ్మాయి లాగే ఎంతో సహజంగా ఉన్న శిల్పాన్ని చూసి అందరూ అమ్మాయి కదలకుండా ఉంది అని ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అంత అందంగా సహజంగా బొమ్మను తయారు చేసిన శిల్పి నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు.
పసుపు రంగు స్వెటర్ నల్ల రంగు ప్యాంటు వేసుకున్న ఆ బొమ్మని చూస్తే ఎవరైనా సజీవంగా ఉన్న అమ్మాయి అనుకోవాల్సిందే. లండన్ షోహోలోని లాజ్ ఎంపోరియం ఆర్ట్ గ్యాలరీలో ఈ కళాఖండాన్ని భద్రపరిచారు. ఎంతో అందంగా ఉన్న ఈ బొమ్మకు గ్యాలరీ ఓనర్ స్టీవ్ లాజా రైడ్స్ ముద్దుగా క్రిస్టినా అని పేరు కూడా పెట్టాడు. ఈ సంఘటన నవంబర్ 25న , ఆ గ్యాలరీ లోని కేర్ టేకర్ టీ పెట్టుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు చోటు చేసుకుంది.
ఆమె పైకి వెళ్ళిన ఈ సమయంలోనే కదలకుండా బెంచి మీద పడి ఉన్న ఆ బొమ్మని చూసి దారిన పోయే వ్యక్తి అమ్మాయి ఎవరో లోపల స్పృహ తప్పి పడిపోయింది అని కంగారు పడ్డాడు. గతంలో కూడా క్రిస్టియాని చూసి నిజమైన అమ్మాయి అనుకుని సహాయం చేయడానికి కొంతమంది మెడికల్ విద్యార్థులు ముందుకు వచ్చారని, తర్వాత విషయం తెలిసి నవ్వుకుంటూ వెళ్లిపోయారని స్టోర్ యజమాని వెల్లడించారు.