Railway Stations : 8 రైల్వే స్టేషన్లకు స్వామీజీలు, స్వాతంత్య్ర యోధుల పేర్లు
జైస్ స్టేషన్‌కు గురు గోరఖ్‌నాథ్ ధామ్, మిస్రౌలీ స్టేషనుకు మా కాలికన్ ధామ్, బానీ స్టేషనుకు స్వామీ పరమహంస అనే పేర్లు పెట్టారు.
- By Pasha Published Date - 09:39 AM, Wed - 28 August 24

Railway Stations : రైల్వేశాఖ మరో కీలక ఆదేశం జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో డివిజన్‌లో ఉన్న 8 రైల్వే స్టేషన్ల పేర్లను మారుస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. ఈసారి రైల్వే స్టేషన్లకు ప్రఖ్యాత స్వామీజీలు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను రైల్వే స్టేషన్లకు పెట్టారు. ఈమేరకు నార్తెర్న్ రైల్వే విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ మార్పుల ప్రకారం..కశ్మీర్ హాల్ట్ రైల్వే స్టేషన్‌కు(Railway Stations) జైస్ సిటీ రైల్వే స్టేషన్ అని పేరు మార్చారు. జైస్ స్టేషన్‌కు గురు గోరఖ్‌నాథ్ ధామ్, మిస్రౌలీ స్టేషనుకు మా కాలికన్ ధామ్, బానీ స్టేషనుకు స్వామీ పరమహంస అనే పేర్లు పెట్టారు. నిహాల్ ఘర్ రైల్వే స్టేషనుకు మహారాజా బిజ్లీ పాసీ, అక్బర్ గంజ్ స్టేషనుకు మా అహోర్వ భవానీ ధామ్, వారిస్ గంజ్ స్టేషనుకు అమర్ షహీద్ భాలే సుల్తాన్, ఫుర్సత్ గంజ్ స్టేషనుకు తాపేశ్వర్ నాథ్ ధామ్ అని పేర్లు మార్చారు.
Also Read :Passport Services: 5 రోజులపాటు మూత పడనున్న పాస్‌పోర్ట్ సేవలు.. కారణమిదే..?
కాసింపూర్ హాల్ట్ స్టేషను అనేది కాసింపూర్ గ్రామానికి చాలా దూరంలో ఉంది. అందుకే దానికి జైస్ సిటీ అనే పేరు పెట్టారు. జైస్ రైల్వే స్టేషనుకు సమీపంలోనే గురు గోరఖ్ నాథ్ ధామ్ ఆశ్రమ్ ఉంది. అందుకే అక్కడి స్టేషనుకు ఆశ్రమం పేరును పెట్టారు. మిశ్రౌలీ, బానీ, అక్బర్ గంజ్, ఫుర్సత్ గంజ్ రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో చాలా శివాలయాలు, కాళీ మాత ఆలయాలు ఉన్నాయి. అందుకే వాటికి ఆయా పేర్లు పెట్టారు. నిహాల్ ఘర్ రైల్వే స్టేషన్ ఉండేే ప్రాంతంలో పాసీ కులం ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆ స్టేషనుకు మహారాజా బిజ్లీ పాసీ పేరు పెట్టారు. గతంలో పాసీ కులానికి రాజుగా ఆయన వ్యవహరించారు. వారిస్ గంజ్ అంటేనే భాలే సుల్తాన్ వీరత్వం గుర్తుకొస్తుంది. ఆయన 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో బ్రిటీష్ వారితో వీరోచితంగా పోరాడారు. అందుకే అక్కడి రైల్వే స్టేషనుకు భాలే సుల్తాన్ పేరు పెట్టారు.