5 State Assembly Election Results 2022 LIVE Updates
- By Balu J Published Date - 08:47 AM, Thu - 10 March 22
గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇవాళ ఐదు శాసనసభలకు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అస్సాంలోని మజులి అసెంబ్లీ స్థానానికి ఏకకాలంలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా కలిసి కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8.00 గంటల నుంచే మొదలైంది.
LIVE NEWS & UPDATES
-
10 Mar 2022 05:40 PM (IST)
బీజేపీ హవా.. ఆప్ మెరుపు!
ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఊహించనివిధంగా బీజేపీ దూసుకుపోయింది. ఒక్క పంజాబ్ మినహా నాలుగు (మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాల్లో తన ఆధిక్యం ప్రదర్శించింది. ఇక ఆ రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. యూపీలో మ్యాజిక్ ఫిగర్ అయిన 202 సీట్లను గెలుచుకుది. దీంతో క్లియర్ మెజారిటీతోనే బీజేపీ మరోమారు యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. 403 సీట్లు కలిగిన యూపీ అసెంబ్లీలో 202 సీట్లు తెచ్చుకున్న పార్టీ విక్టరీ కొట్టినట్టేనని చెప్పాలి. అయితే గురువారం సాయంత్రం 5.30 గంటలకే బీజేపీ ఏకంగా 208 సీట్లలో విజయం సాధించింది. ఇక సాయంత్రం 6 గంటల సమయానికి బీజేపీ ఏకంగా 223 సీట్లలో విజయం సాధించగా.. ఇంకా 50 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో యోగీ తన మార్క్ పాలనతో బీజేపీకి అధికారం కట్టబెట్టాడు. ఇక కాంగ్రెస్ మాత్రం పూర్తిగా వెనుకబడిపోయింది. యూపీలో గాంధీ కుటుంబం దాదాపుగా గాయబ్ అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మాయవతి కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ కూడా మోడీ స్ట్రాటజీని పసిగట్టలేక రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక ఢిల్లీకి పరిమితమైన ఆమ్ ఆద్మీ తనకు తిరుగు లేదని అనిపిస్తూ పంజాబ్ లో తిష్ట వేసింది. అక్కడ ఆప్ అభ్యర్థులు సీఎంలను ఓడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క అడుగు ముందుకేసి రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది.
-
10 Mar 2022 04:17 PM (IST)
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలివే!
Uttarpradesh 403/403
BJP 276
INC 2
SP 120
BSP 4
Others 1Uttarakhand 70/70
BJP 43
INC 23
AAP 0
BSP 0
Others 4Manipur 60/60
BJP 28
INC 9
NPP 8
NPF 5
Others 10Goa 40/40
BJP 20
INC+ 12
TMC+ 2
AAP 2
Others 4Punjab 117/117
BJP+ 2
INC 17
AAP 91
SAD+ 6
Others 1
-
10 Mar 2022 03:40 PM (IST)
గోవాలో బీజేపీదే అధికారం
గోవాలో అత్యధిక సీట్లు సాధించబోతున్న పార్టీగా బీజేపీ నిలిచింది. దీంతో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం దాదాపు ఖాయం. ఈ నేపథ్యంలో గోవా సీఎంగా ఎవరు ఎన్నికవుతారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్న ప్రమోద్ సావంత్ ఈసారి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సావంత్.. సాంకెలిమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణం తర్వాత, ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
-
10 Mar 2022 03:22 PM (IST)
సోనూసూద్ సోదరికి ఓటమి
ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఓడిపోయారు. పంజాబ్ లోని మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె... ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా చేతిలో పరాజయం పొందారు. ఏకంగా 58,813 ఓట్ల తేడాతో అమన్ దీప్ గెలుపొందారు. మాళవికకు 38,125 ఓట్లు వచ్చాయి.
-
10 Mar 2022 01:35 PM (IST)
కేసీఆర్ ఆశలు గల్లంతు
సెమిఫైనల్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఫలితాలతో తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు మారుతాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఆయన నోరు తెరిస్తే చాలు మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించే కేసీఆర్‌ను ప్రధాన శత్రువుగానే బీజేపీ భావిస్తోంది. కేసీఆర్ పాలనలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి బీజేపీ నూతనోత్సాహాన్ని నింపుకుంది. ఈ రెండు చోట్ల ఓటమి టీఆర్ఎస్‌లో తెలియని భయాన్ని నింపిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తుండటంతో కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ ఆశలు గల్లంతైనట్టుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజా ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవిధంగా స్పందిస్తారు?జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహమేమిటి? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
-
10 Mar 2022 01:10 PM (IST)
కెప్టెన్ అమరీందర్ సింగ్ ఘోర ఓటమి!
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేయడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇక తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ (Punjab) లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ (Captain Amarinder Singh ) ఓటమి పాలయ్యారు. పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ చేతిలో 19, 797 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
-
10 Mar 2022 12:55 PM (IST)
ఢిల్లీ టు పంజాబ్.. కేజ్రీ రికార్డ్
పంజాబ్ లో ఆప్ 62 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో మ్యాజిక్ ఫిగర్‌ను అధిగమించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో మాత్రం ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఒక ప్రాంతీయ మరోపార్టీ రెండో రాష్ట్రంలో కూడా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఇదే ప్రథమం. ఈ ఘనత ఆప్ అధినేత కేజ్రీవాల్‌కే దక్కుతుంది. కేజ్రీవాల్ రికార్డు సృష్టించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ ఢిల్లీకే పరిమితమైన ఆప్... తాజాగా పంజాబ్‌లో కూడా సత్తా కనబరచడం విశేషం.
-
10 Mar 2022 12:22 PM (IST)
యూపీలో ‘యోగీ’ రికార్డు
దేశ వ్యాప్తంగా అందరి దృష్టించిన ఆకర్షించిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి వేగం పుంజుకున్నాయి. తాజాగా అందుతున్న ఫలితాల్లో బీజేపీదే హవా. మరోసారి సీఎం యోగి ఆదిత్యనాథ్‌కే సీఎం యోగం అయ్యే అవకాశం దక్కనుంది. గోరఖ్‌పూర్ నుంచి మొదటిసారిగా పోటీ చేసిన సీఎం యోగి మూడో రౌండ్ వచ్చేసరికి 12వేలకు పైగా మెజార్టీతో దూసుకెళుతున్నారు. అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి కొత్త రికార్డు క్రియేట్ చేయనున్నారు.
-
10 Mar 2022 12:17 PM (IST)
పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరు
సెమిఫైనల్స్ గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి కొంత పరాభవం తప్పదని పలువురు విశ్లేషకులు భావించారు. కానీ అందరి అంచనాలు తప్పని నిరుపిస్తూ బీజేపీ తన హవా ప్రదర్శిస్తోంది. ఒక్క పంజాబ్ మినహా ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్లుతోంది. ఒక్క పంజాబ్ లో మాత్రమే రేసులో వెనుకబడిపోయింది. అక్కడ ఆమ్ ఆద్మీ ఇప్పటికే స్పష్టమైన మెజార్టీ దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ లో 270, మణిపూర్ లో 25, ఉత్తరాఖండ్ లో 42, గోవాలో 15 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.
-
10 Mar 2022 12:02 PM (IST)
కలిసిరాని ప్రియాంక చరిష్మా
యూపీ ఎన్నికల్లో ప్రియాంగగాంధీ చరిష్మా ఏమాత్రం పనిచేయలేదు. అందుకు ఉదాహరణే యూపీ ఫలితాలు. యూపీలో ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడైందే.. అప్పట్నుంచే ప్రియాంకగాంధీ తన వ్యూహాలను పదునుపెట్టారు. అత్యాచార బాధితులు, సామాజికవేత్తలను అభ్యర్థులను ప్రకటించినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ 272 ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. యూపీలో కాంగ్రెస్ దాదాపు కనమరగువుతుందని చెప్పక తప్పదు.
-
10 Mar 2022 11:07 AM (IST)
పంజాబ్ లో గెలుపు దిశగా ఆమ్ ఆద్మీ!
పంజాబ్ లో మున్సిపల్ ఎన్నికల్లో తన ఉనిఖి చాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన హవా ప్రదర్శిస్తోంది. ఎవరూ ఊహించనివిధంగా ఇతర పార్టీలను వెనక్కి నెట్టి ముందంజలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ నేతలు చన్నీ, సిద్ధూ చర్మిషాలను చెరిపేస్తూ.. ఆమ్ ఆద్మీ గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ సందర్భంగా ఆమ్ ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుతూ.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశ ప్రజలు ఆమ్ ఆద్మీని కోరుకుంటున్నారని, కాబోయే ప్రధాని కేజ్రీవాల్ అని ధీమా వ్యక్తం చేశారు.
-
10 Mar 2022 10:56 AM (IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ డిటేయిల్స్ ఇవే!
ఉత్తర్ ప్రదేశ్ (363/403)
BJP : 253
SP : 98
BSP : 6
CONG : 4
OTH : 2ఉత్తరాఖండ్ (68/70)
BJP : 44
CONG : 20
AAP : 0
OTH. : 4పంజాబ్ (117/117)
AAP : 88
CONG : 13
SAD : 10
BJP : 5
OTH : 1GOA (40/40)
BJP : 18
CONG : 12
TMC : 5
AAP : 1
OTH : 4MANIPUR (60/60)
BJP : 25
CONG : 14
NPP : 11
NPF : 4
OTH : 6
-
10 Mar 2022 10:09 AM (IST)
ఉత్తరాఖండ్ లో ‘బీజేపీ’ టాప్ ప్లేస్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఉత్తరఖాండ్ లో తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో బీజేపీ 40, కాంగ్రెస్ 25 స్థానాలు సాధించి ముందువరుసలో నిలిచాయి. అయితే ప్రధాన మంత్రి మోడీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వంపై వ్యతిరేకతను చెరిపేసేందుకు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే మోడీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల్లో అద్బుత స్పందన వస్తోంది. ఉత్తరా ఖాండ్ లోనూ బీజేపీ ఆధిక్యం ప్రదర్శించడానికి కారణం కూడా ఈ నల్ల చట్టాలు రద్దు చేయడమే.
-
10 Mar 2022 10:00 AM (IST)
మణిపూర్ లో ‘కమలం’ ముందంజ
దేశంలో ఐదు రాష్ట్రాల్ల ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక మణిపూర్ లో బీజేపీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటివరకు కౌంటింగ్ ప్రక్రియను పరిశిలిస్తే బీజేపీ 18, కాంగ్రెస్ 9, ఎన్ పీసీ 7, జేడీయూ 5 స్థానాల్లో నిలిచాయి. ఇతర పార్టీల కంటే బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది.
-
10 Mar 2022 09:51 AM (IST)
గోవాలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో గోవా కూడా ప్రత్యేకార్షణగా నిలువనుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన కౌంటింగ్ లో బీజేపీ, కాంగ్రెస్ ‘నువ్వానేనా’ అన్నట్టుగా పోటీ నెలకొంది. కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ ముందంజలో నిలువగా, ఆ తర్వాత బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం గోవాలో బీజేపీ 18, కాంగ్రెస్ 16 స్థానాలు సాధించి ఇతర పార్టీల కంటే ముందువరుసలో నిలిచాయి.
-
10 Mar 2022 09:21 AM (IST)
యూపీలో మ్యాజిక్ దాటేసిన బీజేపీ
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. ఎస్ పీ అధినేత అఖిలేష్, బీజేపీ ముఖ్యమంత్రి యోగి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టు పోటీ నెలకొంది. అయితే తాజాగా కౌంటింగ్ లో మాత్రం యూపీలో బీజేపీ ముందంజలో నిలుస్తోంది. ఇప్పటికే 205 స్తానాల్లో ఆధిక్యం సాధించింది. ఇక ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఏడు రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతుండగా, మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
-
10 Mar 2022 09:10 AM (IST)
పంజాబ్ లో ఆప్ ఆధిక్యం!
ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ రేసులో నువ్వానేనా అన్నట్టుగా పోటీ ఇస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆప్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తే.. కేజ్రీవాల్ హవా ఇతర రాష్ట్రాలకు పాకనుంది. ఇప్పటికే తెలంగాణలో సైతం ఆప్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.