Best Food Cities : ‘వరల్డ్ బెస్ట్ ఫుడ్ సిటీస్’లో ఇండియన్ నగరాలివే..
Best Food Cities : ట్రావెల్ ఆన్‌లైన్ గైడ్ అయిన ‘టేస్ట్ అట్లాస్’ ఇటీవల ప్రపంచంలోని ఉత్తమ ఆహార నగరాల జాబితాను విడుదల చేసింది.
- Author : Pasha
Date : 23-12-2023 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
Best Food Cities : ట్రావెల్ ఆన్‌లైన్ గైడ్ అయిన ‘టేస్ట్ అట్లాస్’ ఇటీవల ప్రపంచంలోని ఉత్తమ ఆహార నగరాల జాబితాను విడుదల చేసింది. 100 ప్రపంచ నగరాలతో కూడిన ఈ లిస్టులో మన హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, లక్నో సిటీలు ఉన్నాయి. ఈ లిస్టులో టాప్ 50లో మన ఇండియాకు చెందిన ముంబై, హైదరాబాద్ ఉన్నాయి. బెస్ట్ ఫుడ్ లభించే సిటీల ఈ లిస్టులో ప్రపంచంలో ముంబైకి 25వ ర్యాంకు, హైదరాబాద్‌కు 39వ ర్యాంకు దక్కడం విశేషం. మన దేశ రాజధాని ఢిల్లీకి 56వ ర్యాంకు, చెన్నైకి 65వ ర్యాంకు, లక్నోకు 92వ ర్యాంకు వచ్చాయి. బిర్యానీ టేస్ట్‌కు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ అనే విషయం అందరికీ తెలుసు. ఢిల్లీ, ముంబై నగరాలు వివిధ రకాల చాట్‌లకు ప్రసిద్ధి. చెన్నై దాని రుచికరమైన దోస, ఇడ్లీలకు ఫేమస్. కబాబ్‌లు, బిర్యానీలతో కూడిన ముగ్లాయ్ వంటకాలకు లక్నో ప్రసిద్ధి. మన దేశ ప్రజలు ఇష్టపడే ఇతర ఫుడ్స్‌లో పావ్ భాజీ, దోస, వడ పావ్, ఛోలే భతురే, కబాబ్స్, నిహారీ, పానీ పూరీ, ఛోలే కుల్చే ఉన్నాయి. వీటిని స్ట్రీట్ ఫుడ్‌గా కూడా విక్రయిస్తుంటారు. ఈ స్టాల్స్ వద్ద ఎంతటి గిరాకీ ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం.
We’re now on WhatsApp. Click to Join.
- ప్రపంచంలోని ఉత్తమ ఆహార నగరాల జాబితాలో నంబర్ 1 ప్లేస్‌లో ఇటలీలోని రోమ్ నగరం నిలిచింది. రెండు, మూడో స్థానాల్లో కూడా ఇటలీలోని బోలోగ్నా, నేపుల్స్ నగరాలు ఉన్నాయి. ఈ మూడు ఇటాలియన్ నగరాలు పాస్తా, పిజ్జా, జున్ను ఆధారిత వంటకాలకు ఫేమస్.
- ఉత్తమ ఆహార నగరాల టాప్ 10 జాబితాలో వియన్నా (ఆస్ట్రియా), టోక్యో (జపాన్), ఒసాకా (జపాన్), హాంకాంగ్ (చైనా), టురిన్ (ఇటలీ), గాజియాంటెప్ (టర్కీ), బాండుంగ్ (ఇండోనేషియా) ఉన్నాయి.