Bihar Bridge Collapse : బిహార్లో 14 రోజుల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి..ప్రభుత్వం ఏంచేస్తుందంటే..!!
పురాతన బిడ్జ్ లు కూలిపోయాయంటే ఏదో అనుకోవచ్చు..కానీ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ లు , కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ లు సైతం కూలిపోతున్నాయంటే ఏమనాలి
- Author : Sudheer
Date : 05-07-2024 - 7:11 IST
Published By : Hashtagu Telugu Desk
బిహార్ (Bihar ) రాష్ట్రంలో ఎప్పుడు ఏ బ్రిడ్జ్ కూలిపోతుందో (Bridge Collapse) అర్ధం కానీ పరిస్థితి నెలకొంది..14 రోజుల్లో 12 బ్రిడ్జ్ లు కూలిపోయాయంటే అక్కడి ప్రభుత్వం , అధికారులు ఏ మేర జాగ్రత్తలు పాటిస్తున్నారో..ఎంత మేర నాణ్యత తో కడుతున్నారో అర్ధం అవుతుంది. పురాతన బిడ్జ్ లు కూలిపోయాయంటే ఏదో అనుకోవచ్చు..కానీ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ లు , కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ లు సైతం కూలిపోతున్నాయంటే ఏమనాలి..? దీనిపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా చర్చగా మారింది. ప్రతి ఒక్కరు విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ కూడా పెద్దగా ప్రాణ హాని లేనప్పటికీ..ఒకవేళ ప్రాణాలు పోతే ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం ఏకంగా 11 మంది ఇంజనీర్లను సస్పెండ్ (12 Suspend the Engineers) చేసింది. కూలిన బ్రిడ్జిల స్ధానంలో నూతన వంతెనల పునర్నిర్మాణానికి నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు కొత్త బ్రిడ్జ్ లకు అయ్యే ఖర్చును దోషులుగా తేలిన కాంట్రాక్టర్ల నుంచి రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఫ్లయింగ్ స్వాడ్స్ తమ నివేదికలను సమర్పించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇంజనీర్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ కొరవడటం ఫలితంగా ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ ఆరోపించారు.
Read Also : Lava Blaze X 5G: మార్కెట్లోకి లావా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ప్రీమియం లుక్స్ తో ఆకట్టుకుంటోందిగా!